చికెన్, మటన్ షాపుల వద్ద ఫుల్ రష్

చికెన్, మటన్ షాపుల వద్ద ఫుల్ రష్

హైదరాబాద్ : నగరంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కనుమ కావడంతో నాన్ వెజ్ కు డిమాండ్ భారీగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే నాన్ వెజ్ షాపుల వద్ద జనం క్యూ కట్టారు. నిన్నటితో పోలిస్తే ఇవాళ సేల్స్ భారీగా పెరిగాయి. పలు ప్రాంతాల్లో ముక్క కోసం రెండు గంటలకు పైగా క్యూలైన్‭లోనే నిల్చుని ఉన్నామని నాన్ వెజ్ ప్రియులు చెబుతున్నారు. సంక్రాంతి పండగ రోజు కంటే కనుమ రోజు నాన్ వెజ్‭కు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. పంజాగుట్టలోని చికెన్, మటన్ షాపుల వద్ద భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఎప్పటికంటే ఇవాళ రష్ ఎక్కువగా ఉందని నాన్ వెజ్ ప్రియులు చెబుతున్నారు. ఇక ధరల విషయానికి వస్తే మామూలు రోజుల్లో మాదిరిగానే ఉన్నాయని అంటున్నారు.