వీసా గడువు ముగిసినా హైదరాబాద్లోనే.. నలుగురు అరెస్ట్... స్వదేశాలకు రిటర్న్..

వీసా గడువు ముగిసినా హైదరాబాద్లోనే.. నలుగురు అరెస్ట్... స్వదేశాలకు రిటర్న్..
  • విదేశీయులను స్వదేశాలకు పంపిన నార్త్​జోన్​ టాస్క్​ఫోర్స్​పోలీసులు

పద్మారావునగర్, వెలుగు: వీసా గడువు ముగిసినా అక్రమంగా హైదరాబాద్‌‌లో ఉంటున్న నలుగురు విదేశీయులను టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని స్వదేశాలకు పంపించారు. నార్త్‌‌ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీ ఎస్‌‌ సుదేంద్ర తెలిపిన వివరాల ప్రకారం..  మాక్స్‌‌వెల్ ఆంథోనీ ఇజుచుక్వు(29) ఇబ్రహీం నియాషా (38) నైజీరియాకు చెందిన వారు. 

మ్వాజుమా అల్మాసి మసిసిలా(30) టాంజానియా కు చెందిన మహిళ కాగా, అహ్మద్ హమీద్ అబుజాబర్ హమీద్ ( 27) సూడాన్ దేశానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వీరి వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదన్నారు. ఇలాంటి వారికి షెల్టర్ ఇచ్చేటపుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. లేకపోతే కేసులు నమోదు చేస్తామని డీసీపీ హెచ్చరించారు.