అసోంలో భారీ వర్షాలు, వరదలు

 అసోంలో భారీ వర్షాలు, వరదలు

ఈశాన్యా రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురస్తున్న వానకు ప్రజలు అల్లాడిపోతున్నారు. అసోంలో అయితే వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఈ క్రమంలో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అసోంలోని 25 జిల్లాల్లో వర్షాలు, వరదలు కారణంగా 11 లక్షల మందికిపైగా నిరాశ్రులయ్యారు.మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు దెబ్బతిన్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. మేఘాలయ తూర్పుఖాసీ హిల్స్ లోని సోహ్రాలో గడిచిన 24 గంటల్లో 972 మిల్లిమీటర్ల వర్షం పాతం నమోదైంది. 1955 తర్వాత 2022 జూన్ 17న అత్యధికంగా వర్షపాతం నమోదైందని భారత వాతావరణశాఖ తెలిపింది.