అనగనగా ఒక ఊరు..కాంతులు వెదజల్లే ఊరు

అనగనగా ఒక ఊరు..కాంతులు వెదజల్లే ఊరు

ప్రపంచంలో ఏ మూల నుంచైనా ఆకాశం వైపు చూస్తే మేఘాలు కనిపిస్తాయి. కానీ, ఇక్కడ మాత్రం చాలా స్పష్టమైన నీలాకాశం కనువిందు చేస్తుంది. అక్కడ సూర్యచంద్రనక్షత్రాలను చూస్తే మైమరిచిపోవాల్సిందే. ఆ కాంతి ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ అనుభూతి కోసం స్వీడన్​లోని చిన్న గ్రామం అబిస్కోకి వెళ్లాలి. అక్కడ వెలుగులు చిమ్మే నార్తర్న్​ లైట్స్​ను చూడాలి.

అబిస్కో విలేజ్ ఉత్తరాన ఆర్కిటిక్ సర్కిల్​కి 200 కిలో మీటర్ల దూరంలో ఉంది. కిరునా మున్సిపాలిటీలోని నార్విక్, స్వీడిష్​ ల్యాప్​ల్యాండ్​కి మధ్యలో ఉంది. ఇంకా చెప్పాలంటే అబిస్కో నేషనల్ పార్క్​కి నాలుగు కిలో మీటర్ల దూరంలో పశ్చిమ దిశలో ఉంది. ఇక్కడ 2005 నాటికి 85 మంది మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత జనాభా పెరిగారా? తగ్గారా అనేది ఇప్పటికైతే ఎలాంటి డాటా అందుబాటులో లేదు. ఇక్కడ డెయిలీ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ట్రైన్స్ తిరుగుతుంటాయి. అవి నార్వేజియన్ సిటీ నుంచి నార్విక్ వెళ్తూ మధ్యలో అబిస్కో విలేజ్, అబిస్కో టూరిస్ట్​ స్టేషన్​లలో ఆగుతుంది.

అబిస్కో వెళ్లాలంటే కారులో కూడా వెళ్లొచ్చు. అందుకోసం1980ల్లోనే నార్విక్, కిరునా మధ్య ఇ–10 హైవే ఏర్పాటు చేశారు. అలాగే ఇతర ట్రాన్స్​పోర్టేషన్ విషయానికొస్తే చలికాలంలో హైకింగ్​, డాగ్​ స్లెడ్డింగ్ చేయొచ్చు. అంతేకాదు.. సైంటిఫిక్ రీసెర్చ్​కి కూడా ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం. నీటి ఒడ్డున అనేక రీసెర్చ్​ సెంటర్స్​ ఉంటాయి. ఎకాలజీ, హైడ్రాలజీ, క్లైమేట్​ ఛేంజ్​ ఎఫెక్ట్స్ వంటి అంశాలపై ఇక్కడ సైంటిఫిక్ స్టడీస్ జరుగుతుంటాయి. 

నార్తర్న్​ లైట్స్ 

అబిస్కో గ్రామం ఉన్న ఏరియాలో ఆకాశం తేటగా ఉంటుంది. పొల్యూషన్ చాలా తక్కువ. అందుకే నార్తర్న్‌ లైట్స్ బాగా కనిపిస్తాయి. అబిస్కోలో ఎన్నిరోజులు ఉన్నా నార్తర్న్​ లైట్స్ చూడ్డానికి రాత్రుళ్లు కనీసం మూడు లేదా నాలుగ్గంటలపాటు అద్భుతమైన సీనరీస్​ చూడొచ్చు. కనీసం నాలుగు రాత్రుళ్లు బస చేస్తే మీ ట్రిప్​కి న్యాయం జరిగినట్లు.

నేషనల్ పార్క్

అబిస్కో నేషనల్ పార్క్​ స్వీడన్​లోనే చాలా పాపులర్​. . అబిస్కో నేషనల్ పార్క్ టోర్నెట్రాస్క్ సరస్సు ఒడ్డున ఉంటుంది. ఇక్కడ రెయిన్​డీర్, మూస్, నక్కలు వంటివి చూడొచ్చు. వైల్డ్​ లైఫ్​తోపాటు కొండలు, సరస్సులు, అడవులు వంటి ప్రకృతి దృశ్యాలెన్నో కనిపిస్తాయి. ఈ పార్క్​ 440 కిలో మీటర్ల కుంగ్​స్లెడెన్ హైకింగ్​ రూట్​లో భాగం. అందువల్ల ప్రొఫెషనల్ హైకర్లు ఏడాదంతా ఇక్కడికి వెళ్తుంటారు. పార్క్​ చరిత్ర, ఎకాలజీ తెలుసుకోవాలంటే అబిస్కో నేచురమ్ విజిటర్ సెంటర్​ని కూడా చూడొచ్చు.  

టోర్నెట్రాస్క్ లేక్

స్వీడన్​లోని ఉత్తరభాగంలో అంటే, అబిస్కో నేషనల్ పార్క్​లో ఉంటుంది. ఇది స్వీడన్​లోనే అతి పెద్ద సరస్సు. దీని ఉపరితలం దాదాపు 330 కిలో మీటర్లు విస్తరించి ఉంటుంది. అంతేకాదు.. ఆ దేశంలోనే అతి లోతైన సరస్సు కూడా ఇదే. దీని లోతు దాదాపు168 మీటర్లు. ఈ ప్రాంతం చేపలు పట్టడానికి, అనేక రకాల చేప జాతుల్ని చూడ్డానికి పాపులర్​ ప్లేస్. 

ఇక్కడికి వెళ్లడం చాలా ఈజీ

అబిస్కో వెళ్లడానికి మరో కారణం ట్రాన్స్​పోర్టేషన్ ఈజీగా ఉండటం. దీనికి దగ్గర్లో స్టాక్​హోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్​ ఉంది. అక్కడి నుంచి రీజినల్​ ఫ్లైట్​లో కిరునాకి చేరుకోవచ్చు. అలాగే స్టాక్​హోమ్ నుంచి కిరునాకు ఏడాది పొడవునా ఫ్లైట్స్ తిరుగుతుంటాయి.​ కిరునా ఎయిర్​పోర్ట్​ నుంచి బస్​ లేదా ట్యాక్సీ ఎక్కి రైల్వే స్టేషన్​కి వెళ్లాలి. అక్కడి నుంచి దాదాపు పావుగంట జర్నీ చేస్తే కిరునా నుంచి అబిస్కో చేరుకోవచ్చు. అడ్వెంచర్స్ ఇష్టపడేవాళ్లయితే స్టాక్​హోమ్ నుంచి అబిస్కోకు ఆర్కిటిక్​ ట్రైన్​లో దాదాపు15గంటల జర్నీ చేయాల్సి ఉంటుంది. అబిస్కో విలేజ్​లో బస చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అన్ని రకాల బడ్జెట్స్, సౌకర్యాలతో అకామిడేషన్ దొరుకుతుంది. చిన్న ఊరు కాబట్టి ఇక్కడ తినడానికి ఎక్కువ రెస్టారెంట్స్ ఉండవు. కానీ, ఉన్నవాటిలోనే మంచి ఫుడ్​ దొరుకుతుంది. 

బెస్ట్​ టైం ఇదే

సెప్టెంబర్​ నుంచి ఏప్రిల్​ మధ్యలో వెళ్తే  అబిస్కో టూర్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా టూరిస్ట్​లు ఇక్కడికి వస్తుంటారు. అంతేకాదు.. నవంబర్​ నంచి మే మధ్యలో వింటర్​ టూరిజం యాక్టివిటీస్​ కూడా ఉంటాయి ఇక్కడ. అందులో భాగంగా డాగ్ స్లెడ్డింగ్, స్నో మొబైలింగ్ ఉంటాయి. స్నో మొబైలింగ్​ చేస్తూ నార్తర్న్​ లైట్స్​ని బ్యూటిఫుల్​గా క్యాప్చర్ చేయొచ్చు. స్కాండిన్వియా  ప్రాంతంలోనే అత్యంత పొడిగా ఉండే ప్రదేశం అబిస్కో. మేఘాలు లేకుండా ఎంతో ఆకర్షణీయంగా ఉండే నార్తర్న్​ లైట్స్​ని చూస్తూ అనుభూతి చెందాలంటే ఇది పర్ఫెక్ట్​ ప్లేస్. అదే ఎండాకాలంలో ఇక్కడికి వెళ్తే హైకర్స్, ప్రకృతి ప్రేమికులు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు.