కోవిడ్ రూల్స్ బ్రేక్.. ప్రధానికి భారీ ఫైన్ వేసిన పోలీసులు

కోవిడ్ రూల్స్ బ్రేక్.. ప్రధానికి భారీ ఫైన్ వేసిన పోలీసులు

కరోనా విజృంభిస్తుండటంతో నియంత్రణకు పలు దేశాలు  కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కోవిడ్ రూల్స్ ను పక్కాగా అమలు చేస్తున్నాయి. కానీ కొందరు కోవిడ్ రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఓ ప్రధానే కోవిడ్ రూల్స్ ను అతిక్రమించినందుకు  పోలీసులు ఆమెకు ఫైన్ వేసి షాకిచ్చారు.  నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్ కోవిడ్ రూల్స్ బ్రేక్ చేశారని పోలీసులు ఆమెకు 20 వేల నార్వేజియన్ క్రౌన్లు అంటే దాదాపు లక్షా 75 వేలు జరిమానా విధించారు. మార్చిలో ఆమె 60వ బర్త్ డే జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 13 మంది హాజరయ్యారు. నార్వేలో 10 మంది కంటే ఎక్కువ హాజరయ్యే ప్రోగ్రామ్ లను రద్దు చేసింది. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటపడింది. దీంతో ఆమె సారీ చెప్పారు..కానీ రూల్స్ పాటించాలని చెప్పిన ప్రధానే పాటించకపోవడంతో ఫైన్ వేసినట్లు అధికారులు చెప్పారు.