అది చిరుత కాదు..అడవి పిల్లి..తేల్చిన ఫారెస్ట్ సిబ్బంది

అది చిరుత కాదు..అడవి పిల్లి..తేల్చిన ఫారెస్ట్ సిబ్బంది

హైదరాబాద్ మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర సంచరించింది అడవి పిల్లిగా తేల్చారు అధికారులు. నిన్న రాత్రి సమయంలో చిరుతపులి సంచరిస్తుందని ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే కార్మికుడు అధికారులకు సమాచారం ఇచ్చాడు. 

ALSO READ | ప్రజాభవన్ దగ్గర పల్టీలు కొట్టిన కారు

అడవి పిల్లికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే స్పాట్ చేరుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రాత్రి కావడంతో చీకట్లో గాలింపు చర్యలను నిలిపేసిన అధికారులు..ఇవాళ సంచరించింది అడవి పిల్లిగా తేల్చారు ఆఫీసర్లు.