ఔను. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా. అయితే ఏంటి?

ఔను. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా. అయితే ఏంటి?

తాను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నానని, ఈ విషయాన్ని చెప్పుకోవడానికి తనకెలాంటి మోహమాటం ఏమీ లేదని హీరోయిన్ శృతి హాసన్ అంటోంది. తన శరీరాకృతిని మరొకరు జడ్జ్ చేయకూడదని, ఒకరి అభిప్రాయాలకి తగ్గట్టు నడుచుకోవలసిన అవసరం లేదని మండిపడింది.

ఇటీవల సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేసిన ఫోటోలపై కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు. వాటికి కౌంటర్లు ఇస్తూన.. ప్రతీ మహిళ మాదిరిగానే.. హార్మోన్ల కారణంగా శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలిపింది. ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో కష్టపడుతున్నానని, శారీరక మార్పుల వెనుక కష్టం మాములుగా ఉండదని తెలిపింది. ఒకరి జీవితం గురించి వేరేవారు నిర్ణయించలేరని, ఇది నా జీవితం.. నా ముఖం.. ఈ విషయం చెప్పడం సంతోషంగా ఉందంటూ శృతి హాసన్ చెప్పింది.