న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2024-25 తో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు భారతీయ కిసాన్ యూనియన్ నేత నేత రాఖేష్ టికాయత్. మంగళవారం (జూలై 23, 2024 )నాడు పార్లమెంటులో సమర్పించిన బడ్జెట్ పై టికాయత్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ కాగితాలపై చూడటానికి మంచిగానే ఉంటుంది.. ఆచరణలోకి వచ్చేటప్పటికీ రైతులకు ఎలాంటి మేలు జరగదని అన్నారు. రైతులకు సేంద్రీయ వ్యవసాయాన్ని నేర్పించే కంపెనీలు ఈ బడ్జెట్ తో ప్రయోజనం పొందబోతున్నాయన్నారు.
రైతులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్, నీరు అందించాలన్నారు రాకేష్ టికాయత్. రైతులకు మేలు జరగాలంటే ప్రభుత్వమే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఉచిత విద్యుత్తు, నీరు తోపాటు తక్కువ ధరకే ఎరువులు అందించాలన్నారు. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని తగ్గించాలని కోరారు రాఖేష్ టికాయత్.
పాల ఉత్పత్తిలో నిమగ్నమైన మహిళలకు భూమి లేని వారని.. వారికి ఎలాంటి కేటాయింపులు లేవని అన్నారు. ఏడాదిలో పాల ధరలు కూడా పడిపోయాయన్నారు. ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకోసం , వారి ఆరోగ్యానికి సంబంధించి, గ్రామీణ ఆరోగ్యానికి ఎలాంటి పథకాలు కేటాయించలేదని రాకేష్ టికాయత్ అన్నారు.
"Not going to benefit farmers on ground": Rakesh Tikait on Union Budget 2024
— ANI Digital (@ani_digital) July 23, 2024
Read @ANI Story | https://t.co/E7gV0yLlzf#UnionBudget2024 #RakeshTikait #farmers pic.twitter.com/UzrfMHbTrc
