దర్యాప్తు సంస్థలతో రాష్ట్రాన్ని కేంద్రం కంట్రోల్ చేస్తోంది

దర్యాప్తు సంస్థలతో రాష్ట్రాన్ని కేంద్రం కంట్రోల్ చేస్తోంది

న్యూఢిల్లీ: తమిళనాడులో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్స్‌‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు అమలు చేయాల్సిన వ్యూహాలు, నేతల చేరికలపై దృష్టి పెట్టాయి. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా తమిళ ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల క్యాంపెయినింగ్‌లో పాల్గొంటూ హస్తం నేతలు, కార్యకర్తల్లో ఆయన జోష్ నింపుతున్నారు. తమిళ ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం కోసమే తాను విజిట్‌కు వచ్చానని రాహుల్ తెలిపారు.

‘నేను ఇక్కడికి నా మనస్సులోని మాటలను చెప్పడానికి రాలేదు. ప్రజల సమస్యలు, కష్టనష్టాలను తెలుసుకొని పరిష్కరించడానికే వచ్చా. తమిళనాడు సంస్కృతి, చరిత్ర, భాష, స్ఫూర్తిని ప్రధాని మోడీ అర్థం చేసుకోలేకపోతున్నారు. దర్యాప్తు సంస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కంట్రోల్ చేస్తోంది’ అని రాహుల్ పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనల గురించి కూడా ఆయన మాట్లాడారు. హిస్టరీలో తొలిసారి రిపబ్లిక్ డే నాడు రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేయబోతున్నారని పేర్కొన్నారు.