బీహార్ దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శం

బీహార్ దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శం

ఇవాళ బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటేయాలని కోరారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. అలాగే.. ప్రజలు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్క్ లు వేసుకునే పోలింగ్ కేంద్రానికి రావాలని సూచించారు ప్రధాని. కరోనా టైంలో భారీ సంఖ్యలో పోలింగ్ లో పాల్గొని  ప్రపంచదేశాలకు బిహార్ ప్రజలు ఆదర్శంగా నిలిచారన్నారు ప్రధాని. అలాగే.. ఎలక్షన్ కమిషన్ ను ఆయన అభినందించారు. ప్రతీ భారతీయుడిలో ప్రజాస్వామ్యం పట్ల ఎంత గౌరవం ఉందో తెలుస్తుందన్నారు.