
హైదరాబాద్ : ఈ సారి స్థానిక ఎన్ని కల బ్యాలెట్ పత్రాల్లో నోటా గుర్తు కనిపించనుంది. అయితే ఒకే ఒక నామినేషన్ వస్తే దానిని ఏకగ్రీ వంగా పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువ నామినేషన్లు వస్తే నోటాగుర్తు కూడా బ్యాలెట్ పత్రాల్లో ఉంటుంది. అభ్యర్థులు ఎవరూ ఇష్టం లేని పక్షంలో ఓటర్లు నోటా గుర్తును ఎంచుకునేందుకు వీలుంటుంది.
దీంతో వందల సంఖ్యలో ఓట్లతో జరిగే ఈ ఎన్నికల్లో నోటా పలితాలను తారుమారు చేసేఅవకాశం ఉంది. వార్డుల్లో సాధార ణంగా వంద నుంచి రెండొందల ఓట్లుంటాయి. అందులో పది లోపు ఓట్లతో గెలిచే వారు చాలా మంది ఉంటారు. ఈ క్రమంలో గెలిచిన అభ్యర్థి మెజార్టీ స్వల్పంగా ఉండి.. అంతకన్నా ఎక్కువ ఓట్లు నోటాకు పడే అవకాశం కూడా ఉంటుంది. దీంతో పాటు చాలా మంది నోటాపై అవగాహన లేక పోవడం, వేరే గుర్తుగా భావించడం వల్ల దానికి ఓటు వేసే అవకాశం కూడా ఉంది. కొందరు వృద్ధులు కూడ పొరపా టున నోటాకు ఓటేసే ప్రమాదం ఉంది. దీంతో ఈ సారి స్థానిక ఎన్ని కల్లో నోటా ప్రభావం ఉంటుందనే వాదన బలంగా వినిపిస్తుంది.