ప్రేమ విఫలమై ప్రియుడు సుసైడ్ చేసుకుంటే.. ప్రియురాలు బాధ్యత వహించదు.. కోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రేమ విఫలమై ప్రియుడు సుసైడ్ చేసుకుంటే.. ప్రియురాలు బాధ్యత వహించదు.. కోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రేమ విఫలమై లేదా పరీక్షల్లో ఫెయిలయ్యానని ఆత్మహత్య చేసుకున్నా దానికి ఎగ్జామినర్ గానీ, ప్రియుడు లేదా ప్రియురాలు గానీ కారణం కాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యాజ్యం కొట్టివేసినందుకు ఆత్మహత్యకు పాల్పడినా ఎవరూ బాధ్యత వహించలేరని తేల్చి చెప్పింది. ఓ 24 ఏళ్ల యువతి, ఆమె ఇద్దరు సోదరులపై ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలను రద్దు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మహిళ  మాజీ ప్రేమికుడి ఆత్మహత్య విషయంపై వారిపై కేసు నమోదైంది. ప్రాసిక్యూషన్ కేసు ప్రకారం, మృతుడు జనవరి 23, 2023న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. చనిపోయే ముందు అతను మహిళను, ఆమె సోదరులను నిందిస్తూ సూసైడ్ నోట్‌ను రాశాడు.

ప్రేమ విఫలమై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడితే, అతడి ఆత్మహత్యకు సహకరించిన ప్రియురాలిపై కేసు నమోదు చేయరాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. పరీక్షల్లో ఫెయిల్ అవడం వల్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినా లేదా పిటిషనర్ తన కేసు కొట్టివేసినందుకు ఆత్మహత్యకు పాల్పడినా, సంబంధిత టీచర్ గానీ, న్యాయవాది గానీ బాధ్యత వహించరని సింగిల్ జడ్జి జస్టిస్ పార్థ్ ప్రతీమ్ సాహు అన్నారు.

డిసెంబరు 7న జారీ చేసిన ఉత్తర్వులో.. ప్రేమ విఫలమైందని, ప్రేమికుడు ఆత్మహత్యకు పాల్పడితే, పరీక్షల్లో ఫెయిలయ్యానని విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే.. కేసు కొట్టివేసినందుకు ఆత్మహత్య చేసుకున్నా.. ఎగ్జామినర్ గానీ, న్యాయవాది గానీ ఆత్మహత్యకు కారణం కాదని కోర్టు పేర్కొంది. వీక్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి తీసుకున్న తప్పుడు నిర్ణయానికి, మరొకర్ని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిందించలేమని తేల్చి చెప్పింది.

సూసైడ్ నోట్ వివరాలు

ఆ వ్యక్తి తన రెండు పేజీల సూసైడ్ నోట్‌లో దాదాపు 8 సంవత్సరాలుగా మహిళతో ప్రేమ వ్యవహారం ఉందని పేర్కొన్నాడు. అయితే ఆమె అతడితో సంబంధాలు తెంచుకుని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో ఆమె సోదరులు తమ సోదరితో సంబంధాలు కొనసాగించరాదని తనను బెదిరిస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆరోపించాడు.