ఉగ్రసంస్థ ప్రతినిధికి అంత గౌరవమా..సిగ్గుచేటు: జావేద్ అక్తర్

ఉగ్రసంస్థ ప్రతినిధికి అంత గౌరవమా..సిగ్గుచేటు: జావేద్ అక్తర్

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీకి భారత్‌‌ స్వాగతం పలకడం సిగ్గుచేటని ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ మండిపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన టెర్రరిస్టు సంస్థ తాలిబాన్ ప్రతినిధికి అంత గౌరవం ఇవ్వడం తప్పని.. అది తలదించుకునే విషయం అన్నారు. టెర్రరిజాన్ని వ్యతిరేకించేవారు ఇలా చేయడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 

‘‘ఉత్తరప్రదేశ్‌‌లోని సహరాన్‌‌పూర్‌‌లోని దారుల్ ఉలూమ్ దేవ్​బంద్ ముత్తఖీకి ఘనస్వాగతం పలకడం ఆ సంస్థకే సిగ్గుచేటు. బాలికలకు విద్యను పూర్తిగా నిషేధించిన వ్యక్తిని ఇస్లామిక్ హీరోగా చూడడమేంటి. నా భారతీయ సోదర, సోదరిమణులారా మనకు ఏమైంది” అని అక్తర్ ఆవేదన వ్యక్తం చేశారు.