
హైదరాబాద్, వెలుగు: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ 2ఏ అమ్మకాలు బుధవారం నుంచి మొదలవుతాయి. ఫ్లిప్ కార్ట్, క్రోమా, విజయా సేల్స్‌తోపాటు దేశవ్యాప్తంగా రిటైలర్ల దగ్గర దీనిని కొనుక్కోవచ్చు. మీడియాటెక్డైమెన్సిటీ 7350 ప్రో 5జీ ప్రాసెసర్, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, వెనుక 32 ఎంపీ కెమెరా, 6.7 ఇంచుల డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 వాట్ల ఫాస్ట్‌చార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. 8జీబీ+256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ.26 వేలకు, 12జీబీ+256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ.28 వేలకు సొంతం చేసుకోవచ్చని నథింగ్ తెలిపింది.