టీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ కు చేసిందేంలేదు

టీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ కు చేసిందేంలేదు

హైదరాబాద్: TRS హయాంలో హైదరాబాద్ కు చేసిందేం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. శనివారం మీడియాతో మాట్లాడిన రేవంత్.. ఆరు నెలల్లో ఖమ్మం, వరంగల్, జిహెచ్ఎంసి ఎన్నికలు రాబోతున్నాయన్నారు. ఈ ఎన్నికల క్రమంలో కేటీఆర్ సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. గ్రేటర్‌ను ఇస్తాంబుల్ చేస్తామని, ట్యాంక్ బండ్‌లో నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తామని, లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామన్నారని ఇలా అందమైన అబద్దాలు చెప్పి 99 డివిజన్లలో కార్పొరేటర్లను గెలుచుకున్నారని ఆరోపించారు రేవంత్.

టీఆర్ఎస్ చెప్పింది నమ్మి ఆశతో ప్రజలు ఓట్లేశారని తెలిపారు.  సిటీలో ఒక్క ఫ్లై ఓవర్ కూడ కట్టలేదన్న రేవంత్..మై హోం రామేశ్వర్ రావు కోసమే దుర్గం చెరువు ఫ్లై ఓవర్ బ్రిడ్జి కట్టారని ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. TRS నేతలు సిటీలోని అనేక చెరువులను కబ్జా చేశారన్న రేవంత్.. కరోనా టైంలో జనాలను ప్రభుత్వం ఏ మాత్రం ఆదుకోలేదన్నారు. ఎన్నికలు ఉన్నాయనే సిటీలో టీఆర్ఎస్ లీడర్లు హడావుడి చేస్తున్నారని.. ఫలక్ నుమా వరకు మెట్రో ఎందుకు పొడిగించలేదన్నారు. పేదలు ఉండే ప్రాంతాల్లో రోడ్లు దారుణంగా ఉన్నాయని తెలిపారు రేవంత్ రెడ్డి.

GHMC, వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవెర్చలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెల్తామన్నారు.