
రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా పలు మెడికల్ షాపుల్లో, ఫార్మా కంపెనీల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని పలు బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల రైడ్స్ చేస్తున్నారు. ప్రమాణాలు పాటించని 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ చేశారు. బ్లడ్ స్టోరేజ్, బ్లడ్ కలెక్షన్, బ్లడ్ టెస్టుల్లో లోపాలున్నట్లు అధికారులు గుర్తించారు. ప్లేట్లెట్స్ ,ప్లాస్మా నిల్వ లో అధికారులు పూర్తిగా లోపాలున్నట్టు గుర్తించారు.
- మలక్పేట్ లోని శ్రీ బాలాజీ బ్లడ్ సెంటర్
- చైతన్యపూరి లోని నవజీవన్ బ్లడ్ సెంటర్
- లకడికపూల్ లోని AVS బ్లడ్ సెంటర్
- హిమాయత్ నగర్ లోని రుద్ర వాలంటరీ బ్లడ్ సెంటర్
- సికింద్రాబాద్ లోని ప్రతిమ సాయి బ్లడ్ సెంటర్
- కోటిలోని తలసేమియా రక్షిత వాలంటరీ బ్లడ్ బ్యాంక్
- మేహిదీపట్నంలోని వివెంకనంద బ్లడ్ సెంటర్,
- బాలానగర్ లోని నంది బ్లడ్ సెంటర్
- ఉప్పల్ లోని MSN బ్లడ్ సెంటర్ లకు నోటీస్ లు జారీ
పైన తెలిపిన క్లీనిక్స్ కి డ్రగ్స్ కంట్రోల్ నోటీసులు జారీ చేశారు.