
రాష్ట్రంలో నియామకాల ప్రక్రియను సర్కారు వేగవంతం చేసింది. పోలీస్, గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా ఎక్సైజ్, రవాణా శాఖలో 677 పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో 614 పోస్టులు ఉండగా.. పోలీస్ రవాణా విభాగంలో 63 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మే 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు.
జనరల్ కోటాలో 138 పోస్టులు ఉండగా.. వాటిలో 90 మహిళలకు కేటాయించారు. EWS కోటాలో 41 జనరల్, 19 మహిళలకు రిజర్వు చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో 16 పోస్టులు, ఎంఎస్‌పీ కోటాలో 8 పోస్టులు కేటాయించారు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.tslprb.in వెబ్సైట్లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు.