ఏపీలో డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్

ఏపీలో డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్

అమరావతి: ఆంద్రప్రదేశ్ లోని డిగ్రీ  కాలేజీల్లో ఆన్ లైన్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అన్ని యాజమాన్యాలు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అటానమస్ కాలేజీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులకు ఈనెల 17లోగా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీ నుండి క్లాసులు ప్రారంభం అవుతాయని మండలి తెలిపింది. 
ఏపీ అగ్రిసెట్ 2021 ఫలితాలు విడుదల
అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (అగ్రిసెట్-2021) ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈనెల 13వ తేదీన అగ్రిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 2,570 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా వీరిలో 2,538 మంది అర్హత సాధించారని వ్యవసాయ వర్సిటీ వైస్ ఛాన్స్ లర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.