
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీసెస్ విభాగంలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీజీపీఆర్బీ) డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీజోన్ -1లో 50, మల్టీజోన్- 2లో 68 పోస్టులు భర్తీ చేయనున్నట్టు అందులో పేర్కొన్నారు. ఈ పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తామని, ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలను త్వరలోనే వెల్ల డిస్తామని చెప్పారు. హెల్ప్‌లైన్‌నూ అందుబాటులోకి తెస్తామన్నారు.
నోటిఫికేషన్ ప్రకారం.. ఏపీపీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్య ర్థులు ఎల్‌ఎల్‌బీ/ బీఎల్ డిగ్రీ పూర్తి చేసి ఉం డాలి. తెలంగాణలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం మూడేండ్లు అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. బార్ కౌన్సిల్ ఎన్‌రోల్‌మెంట్ తప్పనిసరి. అభ్యర్థుల వయసు 2025 జులై 1 నాటికి 34 ఏండ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేండ్లు సడలింపు ఉంటుంది. నోటిఫికేషన్‌ను www.tgprb.in వెబ్‌సైట్‌లో ఉంచినట్టు శ్రీనివాసరావు తెలిపారు.