
తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ల పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 19 సబ్జెక్ట్ లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ నెల 14 నుంచి జనవరి 4వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పోస్టుల భర్తీకి సంబంధించిన మరింత సమాచారాన్ని అధికార వెబ్ సైట్ లో ఉంచామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.