ఐబీపీఎస్ పీఓ పోస్టులకు నోటిఫికేష‌న్

ఐబీపీఎస్ పీఓ పోస్టులకు నోటిఫికేష‌న్

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీస్)ప్రొబెషనరీ ఆఫీసర్లు /మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో మొత్తం 1167 ఖాళీలున్నాయి. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఈనెల 5 నుంచి ప్రారంభమైంది. ఆగస్ట్26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్–ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా–734, పంజాబ్ & సింథ్ బ్యాంక్–83, యుకో బ్యాంక్–350 అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త. వయసు:2020 ఆగస్ట్ 1 నాటికి 20–30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ, ఎక్స్సర్విస్మెన్లకు ఐదేళ్లు, పీడబ్ల్యూ బీడీలకు పదేళ్ల‌ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల్లో సెలెక్షన్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలకుగాను 35 మార్కులు కేటాయించారు. అన్ని సెక్షన్లలో కలిపి మొత్తం 100 ప్రశ్నలకు గాను
100 మార్కులు కేటాయించారు.

ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి సెక్షన్కు 20 నిమిషాల సమయం ఉంటుంది. ఎగ్జామ్ డ్యురేషన్ 60 నిమిషాలు. ప్రిలి మినరీలో కేటగిరీ వారీగా సెక్షనల్ కటాఫ్ ఉంటుంది. దీనిలో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ కండక్ చేస్ట్ తారు. మెయిన్స్ ఎగ్జా మ్: దీనిలో మొత్తం ఐదు సెక్షన్లుంటాయి. రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 45 ప్రశ్నలకు గాను 60 మార్కులు కేటాయించారు. జనరల్/ఎకానమి/బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్ష్ లీ నుంచి 35 ప్రశ్నలకు 40 మార్కులు, డేటా అనాలసిస్ & ఇంటర్ప్రెటేషన్ నుంచి 35 ప్రశ్నలకు 60 మార్కులు, ఇంగ్ష్ లీ లాంగ్వేజ్(లెటర్ రైటింగ్ &ఎస్సే) నుంచి 2 ప్రశ్నలకు గాను 25 మార్కు లుంటాయి. మొత్తం మార్కులు 225. ఎగ్జామ్ మాడ్యురేషన్ 210 నిమిషాలు. దీనిలో ప్రతి సెక్షన్ నుంచి మినిమం కటాఫ్ మార్కుతో పాటు టోటల్ కటాఫ్ మార్కు వచ్చిన వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు.

ఇంటర్వ్యూ: మెయిన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దీనికి 100 మార్కులు కేటాయించారు. మెయి న్స్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.850, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీలకు రూ.175 ఎగ్జామ్ సెంటర్స్: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

మ‌రిన్ని ఉద్యోగాల నోటిఫికేష‌న్స్ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..