
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 7వ తేదీన MPP, 8వ తేదీన ZP ఛైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. జూన్ 7న MPP ఛైర్ పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్లు, 8వ తేదీన ZP ఛైర్ పర్సన్లు, వైఎస్ ఛైర్ పర్సన్లను ఎన్నుకునేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. చేతులెత్తే పద్ధతిన ZP, MPP ఛైర్మన్లను, వైస్ ఛైర్మన్‌లను ఎన్నుకుంటారు.
జూన్ 7న MPP నామినేషన్లను స్వీకరించి..అదే రోజు ఎన్నిక నిర్వహించనున్నారు. జూన్ 8న ZP ఛైర్మన్ల నామినేషన్లను స్వీకరించి.. అదే రోజు ఎన్నిక నిర్వహించనున్నారు. వాయిదా పడితే తర్వాత రోజు నిర్వహిస్తారు.