Telangana:మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి

Telangana:మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి  ప్రభుత్వం అనుమతి

రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వైద్యారోగ్యశాఖ పరిధిలోని 14 మెడికల్ కాలేజీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 201 ట్యూటర్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీచేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

2023 మార్చి 31 లేదా రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేసే వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు విధుల్లో కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎంపికైన వారందరికీ రూ.57,700 జీతం చెల్లించనున్నట్లు చెప్పింది. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఉద్యోగాల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.