- టీజీసీహెచ్ఈ వినతిపై నాటింగ్‌హామ్ వర్సిటీ ఆసక్తి
హైదరాబాద్, నవంబర్ 24: రాష్ట్రంలోని వర్సిటీలతో యూకేలోని ప్రఖ్యాత నాటింగ్‌హామ్ యూనివర్సిటీ చేతులు కలపడానికి ఆసక్తి చూపుతోంది. సోమవారం ఆ యూనివర్సిటీ ప్రత్యేక ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(టీజీసీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్‌లను కలిసింది. వారికి రాష్ట్రంలో అమలవుతున్న కొత్త కరిక్యులమ్, ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్‌లు, విద్యా సంస్కరణల గురించి చైర్మన్ వివరించారు.
యూకే, చైనా, మలేషియాల్లో ఇప్పటికే 50 వేల మంది విద్యార్థులు చదువుతున్న నాటింగ్‌హామ్ యూనివర్సిటీ.. ఇండియాలోనూ క్యాంపస్ పెట్టాలని, తెలంగాణ వర్సిటీలతో కలిసి రీసెర్చ్, అకడమిక్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆసక్తిగా ఉన్నట్లు యూకే బృందం సభ్యులు తెలిపారు. దాంతో చైర్మన్ బాలకిష్టారెడ్డి వారిని తెలంగాణలో క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరారు.
