ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో దూసుకుపోతున్న జొకోవిచ్

ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో దూసుకుపోతున్న జొకోవిచ్

పారిస్‌‌: వరల్డ్‌‌ నంబర్‌‌వన్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌.. ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో దూసుకుపోతున్నాడు. బుధవారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ సెకండ్‌‌ రౌండ్‌‌లో టాప్‌‌సీడ్‌‌ జొకో 6‑2, 6‑3, 7‑6 (7/4)తో మోల్కన్‌‌ (స్లొవేకియా)పై గెలిచి మూడో రౌండ్‌‌లోకి అడుగుపెట్టాడు. ఇతర మ్యాచ్‌‌ల్లో జ్వెరెవ్‌‌ (జర్మనీ) 2‑6, 4‑6, 6‑1, 6‑2, 7‑5తో బేజ్‌‌ (అర్జెంటీనా)పై, ఇస్నేర్‌‌ (అమెరికా) 6‑4, 6‑4, 3‑6, 7‑6 (7/5)తో బారెర్‌‌ (ఫ్రాన్స్‌‌)పై, అగుర్‌‌ (కెనడా) 6‑0, 6‑3, 6‑4తో కారాబెల్లి (అర్జెంటీనా)పై గెలిచారు. విమెన్స్‌‌ సింగిల్స్‌‌ లో అజరెంకా (బెలారస్‌‌) 6‑1, 7‑6 (3)తో పెట్కోవిచ్‌‌ (జర్మనీ)పై, సబాలెంకా (బెలారస్‌‌) 2‑6, 6‑3, 6‑4తో పక్వెట్‌‌ (ఫ్రాన్స్‌‌)పై, కెర్బర్‌‌ (జర్మనీ) 6‑1, 7‑6 (7/2)తో జాక్వెమెట్‌‌ (ఫ్రాన్స్‌‌)పై నెగ్గగా, ముచోవా (చెక్‌‌) 7‑6 (7/5), 7‑6 (7/4)తో సకారీ (గ్రీస్‌‌)కు, సస్నోవిచ్‌‌ (బెలారస్‌‌) 3-6, 6-1, 6-1తో రాడుకాన్‌‌ (బ్రిటన్‌‌)కు షాకిచ్చారు. మెన్స్‌‌ డబుల్స్‌‌ ‌‌లో రామ్‌‌కుమార్‌‌ (ఇండియా)-హంటర్‌‌ రీస్‌‌ (అమెరికా) 7-6 (4), 6-3తో అల్ట్‌‌మేర్‌‌-అస్కార్‌‌ పై నెగ్గారు.