
న్యూయార్క్: ఊహించినట్లుగానే సెర్బియా స్టార్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్.. యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల తాను న్యూయార్క్‌కు రాలేనని జొకో గురువారం ట్వీట్ చేశాడు. దీంతో 22వ గ్రాండ్‌స్లామ్ గెలిచి నడాల్‌తో సమంగా నిలవాలన్న సెర్బియన్ కల ఫలించేందుకు మరింత సమయం పట్టనుంది. ప్రస్తుతం యూఎస్ ట్రావెల్ రూల్స్ ప్రకారం విదేశీ వ్యక్తులు కచ్చితంగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. అలాంటి వారినే దేశంలోకి అనుమతిస్తారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల జొకో.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కూడా బరిలోకి దిగలేదు.