- నిన్న మధ్యప్రదేశ్..ఇవాళ గుజరాత్..రోజుకు పెరుగుతున్న కలుషిత నీటి సమస్య
- మధ్యప్రదేశ్ లోని ఇండోర్ డ్రైనేజీ వాటర్ కలిసిన నీరు తాగి 10 మంది మృతి
- కలుషిత నీరు తాగి గాంధీనగర్ లో వందమందికి తీవ్ర అస్వస్థత
- బెంగళూరు లోనూ ఇదే పరిస్థితి.. వారం రోజులుగా ప్రైవేట్ నీటి వనరులను ఆశ్రయిస్తున్న ప్రజలు
నిన్న మధ్యప్రదేశ్ లోని ఇండోర్.. ఇవాళ గుజరాత్ లోని గాంధీనగర్.. రెండు ప్రాంతాల్లో ఒకటే సమస్య..నీటి కాలుష్యం..కలుషిత నీటితో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి..వందలాది మంది ఆస్పత్రి పాలయ్యారు. తాగు నీరు కలుషితం అయ్యింది..తక్షణ చర్యలు అవసరం అని కాలుష్య నియంత్రణ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. ప్రపంచంలోని క్లీన్ సిటీగా పేరు ఉన్న ఇండోర్, గుజరాత్ లోని గాంధీనగర్ లాంటి మహానగరాల్లో అనారోగ్య సమస్యలతో వందలాది మంది ప్రజలు ఆసుపత్రిలో చేరడంతో నీటి భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
శనివారం ఇండోర్‌లో డ్రైనేజీ వాటర్ కలిసి కలుషితమైన తాగునీటితో పదిమంది ప్రాణాలు కోల్పో్యిన ఘటన మరువక ముందే తాజాగా గుజరాత్ లోని గాంధీనగర్ లో కూడా ఇదే కలుషిత నీటి సమస్యతో అక్కడి ప్రజలను ఆస్పత్రి పాలయ్యారు. గత ఐదు రోజుల్లో 100 కి పైగా టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. గాంధీనగర్ సివిల్ ఆసుపత్రిలో పిల్లలు సహా 104 మంది రోగులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. గత మూడు రోజుల్లో టైఫాయిడ్ కేసులు బాగా పెరిగాయి. పాజిటివ్ కేసులు దాదాపు 50 శాతం పెరిగాయని అధికారులు గుర్తించారు. రోగుల్లో ఎక్కువమంది పిల్లలున్నారు.
వారం రోజుల్లో గాంధీనగర్‌లోని అనేక ప్రాంతాలలో టైఫాయిడ్ కేసులు అకస్మాత్తుగా పెరిగాయి. నగరంలోని సెక్టార్ 24, 26, 28, ఆదివాడలలో వందలాది మంది ఆస్పత్రిపాలయ్యారు. స్థానికుల అనారోగ్యసమస్యలకు కలుషితనీరే ప్రధాన కారణమని కాలుష్య నియంత్రణ బోర్డు తేల్చింది.
బెంగళూరులోని లింగరాజపురంలోని KSFC లేఅవుట్‌లోని నివాసితులు కలుషిత నీటితో ఆనారోగ్యం బారిన పడ్డారు. గత కొన్ని నెలలుగా జీర్ణశయాంతర సమస్యలు, వాంతులు ,విరేచనాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే గడిచిన వారంలో కలుషిత నీటి మరింత పెరిగిందని తెలుస్తోంది.
భారత్ లో దాదాపు 100శాతం జనాభా కలుషితమైన గాలిని పీలుస్తుందని, ప్రపంచంలోని అత్యంత కలుషితమైన నగరాల్లో 63 భారతదేశంలోనే ఉన్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. వాయు, జల, భూ కాలుష్యం ప్రధాన సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. వేగవంతమైన పట్టణీకరణ, పరిశ్రమలు, వాహనాల రద్దీ, శిలాజ ఇంధనాల వాడకం తీవ్రమైంది. ఇది ముఖ్యంగా ప్రధాన నగరాల్లో దారుణమైన గాలి నాణ్యతకు దారితీస్తుంది. లక్షలాది మంది మృత్యువు బారిన పడుతున్నారు.
►ALSO READ | అమెరికా-వెనిజులా ఇష్యూపై స్పందించిన భారత్.. ఏ దేశానికి సపోర్ట్ చేసిందంటే..?
ఈ సమస్యలకు ప్రధాన కారణాలు వాహన ఉద్గారాలు, పారిశ్రామిక కాలుష్యం, పంట వ్యర్థాలను కాల్చడం, చెత్త నిర్వహణ లేకపోవడం, నదులలో వ్యర్థాలను కలపడం వంటివి కాగా, శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న చెత్త, సరైన వ్యర్థాల నిర్వహణ లేకపోవడం, పరిశ్రమల వ్యర్థాలతో నేల కలుషితమవుతోంది. పట్టణ మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, వ్యవసాయ రసాయనాలు నదులు, సరస్సులను కలుషితం చేస్తున్నాయి. నగరాల్లో నిర్మాణ కార్యకలాపాలు ధూళిని పెంచి, గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో పెరుగుతున్న జల, వాయు కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారు. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వంటివి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. 2019 లెక్కల ప్రకారం..1.67 మిలియన్ల మరణాలు సంభవించాయి. ఓ పక్క వాయుకాలుష్యం, మరోపక్క నీటి కాలుష్యం మహానగరాల్లో అనారోగ్య సమస్యలతో వందలాది మంది ప్రజలు ఆనారోగ్యం బారిన పడుతుండటతో నీటి భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
