వాయిస్ కాల్​ మ్యూట్ చేయొచ్చు

వాయిస్ కాల్​ మ్యూట్ చేయొచ్చు

వాట్సాప్​లో కొత్తగా గ్రూప్​ కాల్ అప్​డేట్ రానుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే  గ్రూప్ కాల్​లో ఉన్నప్పుడు  పార్టిసిపెంట్స్​ కాల్​ని మ్యూట్ చేయొచ్చు. అంతేకాదు వాళ్లకు పర్సనల్​గా మెసేజ్ కూడా పంపొచ్చు. గ్రూప్ కాల్​ చేసినప్పుడు మాట్లాడడం అయిపోయాక కొందరు తమ కాల్​ని మ్యూట్​లో పెట్టడం మర్చిపోతారు. అప్పుడు గ్రూప్ అడ్మిన్​తో పాటు గ్రూప్​లోని ఎవరైనా వాళ్ల కాల్​ని మ్యూట్​లో పెట్టొచ్చు. ​మ్యూట్ ఆప్షన్​ మీద నొక్కినప్పుడు మ్యూట్, మెసేజ్ ఆప్షన్లు కనిపిస్తాయి. కొత్త వెర్షన్​ వాట్సాప్ ఉపయోగిస్తున్న ఆండ్రాయిడ్, ఐఒఎస్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.