కొత్త ఇన్వెస్టర్లకు ఫండ్స్‌‌లో ఏది​ బెస్ట్​?

కొత్త ఇన్వెస్టర్లకు ఫండ్స్‌‌లో ఏది​ బెస్ట్​?

న్యూఢిల్లీ: ఇప్పుడు స్టాక్​ మార్కెట్ల పరిస్థితులు ఏమీ బాగాలేవు. గడచిన నాలుగు సెషన్లలో ఇన్వెస్టర్లు దాదాపు రూ.15 లక్షల కోట్లు కోల్పోయారు. శుక్రవారం ఒక్క రోజే రూ.ఎనిమిది లక్షల కోట్లు నష్టపోయారు. యూఎస్​లో ఆర్థిక పరిస్థితులు, చైనాలో కరోనా కేసుల విజృంభణ కారణంగా ఇక ముందు కూడా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్​ మార్కెట్లలో కరెక్షన్​ వచ్చే అవకాశం ఉందని ఫైనాన్షియల్​ ఎనలిస్టులు అంటున్నారు. 

ఇటువంటి సమయంలో కొత్త ఇన్వెస్టర్లు గందరగోళంలో ఉన్నారు. ఈ దశలో ఏ రకం ఇన్వెస్ట్​మెంట్​ ఎంచుకోవాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం స్టాక్​ మార్కెట్లో ఆటుపోట్ల వల్ల లాంగ్​టర్మ్​ మ్యూచువల్​ ఫండ్​ సిప్ ఇన్వెస్టర్లకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. కొత్త ఇన్వెస్టర్లే ఇప్పుడు ఆచితూచి ఆడుగేయాలి. ఇలాంటి వాళ్లు హైబ్రిడ్​ లేదా బ్యాలన్స్​డ్​ అడ్వాంటేజ్​ పండ్స్​లో ఇన్వెస్ట్​ చేయడం మంచిదన్నది పర్సనల్​ ఫైనాన్స్​ ఎక్స్​పర్టులు చెబుతున్న మాట. 

హైబ్రిడ్​ ఫండ్స్​లో రిటర్నులు రావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మొత్తం డబ్బును వీటిలోనే పెట్టకూడదు. పోర్ట్​ఫోలియో డైవర్సిఫికేషన్​ తప్పనిసరి. కొంత డబ్బును హైబ్రిడ్​ మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టవచ్చు. మొత్తం డబ్బును ఒక్కటే ఫండ్​లో కాకుండా వేర్వేరు దాంట్లో 6–12 భాగాలుగా విభజించి పెట్టాలి. లేదా పెట్టుబడి మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. పడుతున్న మార్కెట్‌‌‌‌లో కొత్త పెట్టుబడిదారులకు హైబ్రిడ్ ఫండ్స్ ఎలా మేలు చేస్తాయనే విషయం గురించి 360 వన్ వెల్త్ సీఎఫ్​ఏ ప్రొడక్ట్ మేనేజర్ సాహిల్ కపూర్ ఇలా అన్నారు. 

"పెట్టుబడిదారులు దీర్ఘకాలిక వ్యూహాత్మక ఆస్తుల కేటాయింపు పద్ధతిని ఎంచుకోవాలి. మార్కెట్ల వాల్యుయేషన్​ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అవసరమైతే చిన్నచిన్న మార్పులు చేసుకోవచ్చు. హైబ్రిడ్ ఫండ్‌‌లు.. వాల్యుయేషన్, మూమెంటం వంటివి ఉపయోగించి పెట్టుబడులకు అనువైన సమయాన్ని ఎంచుకుంటాయి " అని వివరించారు.