
హనుమకొండ సిటీ, వెలుగు: విద్యుత్ లైన్ల వెంట కేబుల్, బ్రాడ్ బ్యాండ్ వైర్లు లేకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హన్మకొండ నక్కలగుట్టలోని కార్పొరేట్ ఆఫీస్లో 16 సర్కిళ్ల పరిధిలోని కేబుల్, బ్రాడ్ బ్యాండ్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమపద్ధతిలో కేబుల్ వైర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆపరేటర్లు ఒకేలా కేబుల్ వైర్లను క్లిప్ చేసుకోవాలని సూచించారు. రోడ్ క్రాస్సింగ్స్ లేకుండా చూసుకోవాలని కోరారు. వినియోగంలో లేని వైర్లను 3 నెలల్లోగా తొలగించాలని ఆదేశించారు. డైరెక్టర్లు వి. తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు రాజు చౌహన్, అశోక్, చరణ్ దాస్, కె.గౌతమ్ రెడ్డి, పి.మధుసూదన్ రావు పాల్గొన్నారు.