జనగామ జిల్లాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. శనివారం (జనవరి 10) జనగామ ఆర్టీసీ చౌరస్తాలో కేటీఆర్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది.
తోపులాటలో కేటీఆర్ చిత్ర పటం కాంగ్రెస్ నాయకుని తలకు తాకడంతో గాయం అయ్యింది. పోలీసుల తీరుకు వ్యక్తిరేకంగా రోడ్ పై బైటాయించి నిరసన తెలుపారు యూత్ కాంగ్రెస్ నాయకులు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అడ్డుకోవడంతోనే కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకునికి గాయాలైనట్లు ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాహుల్ గాంధీ పైన, రేవంత్ రెడ్డిపైన కేటిఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీని దూషించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని, దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
