తాడ్వాయి, వెలుగు : లక్షలాది భక్తులు తరలివచ్చే మేడారం జాతరకు యుద్ధ ప్రతిపాదికన విద్యుత్ సరఫరా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎన్పీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. శుక్రవారం ములుగు సర్కిల్ పరిధిలోని కొత్తగా నిర్మాణంలో ఉన్న నార్లాపూర్ సబ్ స్టేషన్ ను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, దిశా నిర్దేశం చేశారు.
ఈనెల 31 తేదీలోపు అన్ని పనులు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో విద్యుత్ సరఫరా చేసేందుకు సిబ్బంది పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఈ ఆపరేషన్స్ కెలోత్ రాజు చౌహన్, ములుగు ఎస్ఈ ఆనందం, డీఈలు పి.నాగేశ్వర రావు, సదానందం, పురుషోత్తం, ఏడీఈలు వేణుగోపాల్, సందీప్ పాటిల్, రాజేశ్తదితరులు పాల్గొన్నారు.

