
న్యూఢిల్లీ: వివాదాస్పద జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)ని ఇప్పట్లో అమలు చేయబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. డార్జిలింగ్ లో ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఎన్నార్సీ వల్ల గూర్ఖా ప్రజలపై ఎలాంటి ప్రభావం పడదని క్లారిటీ ఇచ్చారు. గూర్ఖా ప్రజల్లో దేశభక్తి ఎక్కువని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో వీరు ముందంజలో ఉంటారని కొనియాడారు. ఇలాంటి గూర్ఖా కమ్యూనిటీకి కమ్యూనిస్టు, కాంగ్రెస్, తృణమూల్ త్రయం మోసం చేస్తూ వచ్చిందని ఆరోపించారు. ఎన్నార్సీ గురించి పర్వత ప్రాంత ప్రజల్లో తృణమూల్ భయాందోళనలు సృష్టింస్తోందని మండిపడ్డారు.