ఎన్నారై మ్యారేజ్ ​రిజిస్ట్రేషన్​ బిల్లు

ఎన్నారై మ్యారేజ్  ​రిజిస్ట్రేషన్​ బిల్లు

స్టాండింగ్​ కమిటీ పరిశీలన

న్యూఢిల్లీ: ఎన్నారై పెళ్లి సంబంధాలలో మోసాలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రిజిస్ట్రేషన్​ ఆఫ్​మ్యారేజ్​ఆఫ్​ నాన్​ రెసిడెంట్​ ఇండియన్​ బిల్​2019’ను పార్లమెంట్​ స్టాండింగ్​ కమిటీకి రాజ్యసభ సిఫార్సు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. రాజ్యసభ చైర్మన్​తో సంప్రదింపుల తర్వాత విదేశీ వ్యవహారాల స్టాండింగ్​ కమిటీకి రిఫర్​ చేసినట్లు లోక్​ సభ స్పీకర్​ వెల్లడించారు. పెళ్లి పేరుతో మహిళలను ట్రాప్​ చేసి, వారిపై వేధింపులకు పాల్పడుతున్న ఎన్నారై పెళ్లికొడుకులపై చర్యలు తీసుకునేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది.

ఈ కొత్త బిల్లు చట్టంగా మారితే.. ఇండియన్​యువతిని పెళ్లి చేసుకున్న ఎన్నారై(ఇండియాతో పాటు బయట చేసుకున్న వివాహం కూడా) నెల రోజుల వ్యవధిలో తన పెళ్లిని రిజిస్టర్​ చేసుకోవాలి. ఒకవేళ 30 రోజులు దాటినా రిజిస్టర్​ చేసుకోకుంటే.. సదరు ఎన్నారై పాస్​పోర్టును స్వాధీనం చేసుకునే/రద్దు చేసే అవకాశం అధికారులకు ఉంటుంది. దీంతో పాటు సదరు ఎన్నారైకి ఇండియాలో ఉన్న ఆస్తులను జప్తుచేసే అవకాశమూ ఉంటుంది.