ఎన్ఆర్ఐల మధ్య చిచ్చుపెట్టిన కరోనా

ఎన్ఆర్ఐల మధ్య చిచ్చుపెట్టిన కరోనా

కరోనా కట్టడిలో అమెరికా, ఇండియా పరిస్థితిని పోల్చిన స్వాతి

హైదరాబాద్, వెలుగు: కరోనా కట్టడిలో అమెరికా, ఇండియా పరిస్థితిని వీడియోలో వెల్లడించిన ఎన్నారై స్వాతి అంశం ఎన్నారైల మధ్య కలకలం రేపుతోంది. పుట్టిన దేశం ఇండియాను పొగుడుతూనే ఆశ్రయమిచ్చిన అమెరికాపై ద్వేషం పెంచేలా వ్యాఖ్యానించారంటూ ఆమెపై అమెరికాలోని ఎన్నారైలు మండిపడ్డారు. స్వాతిపై ఓ ఎన్నారై కేసు కూడా పెట్టారు. వీడియో వివాదానికి దారితీయడంతో.. తాను క్షమాపణ చెప్తున్నట్లు స్వాతి మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఇండియా, అమెరికాను కంపేర్ చేస్తూ..
కరోనా వైరస్ విస్తరించకుండా అడ్డుకోవడంలో అమెరికాలో కన్నా ఇండియాలో బాగా చర్యలు తీసుకుంటున్నారంటూ అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉంటున్న స్వాతి వారం క్రితం ఓ వీడియోను రూపొందించారు. ‘‘ఇండియా జనాభా 130 కోట్లు… అమెరికా జనాభా 35 కోట్లు. వైశాల్యంలో ఇండియాకంటే చాలా పెద్దది అమెరికా. విశాలమైన ఇండ్లు.. వరల్డ్ బెస్ట్ హాస్పిటల్స్.. ఎయిర్ అంబులెన్స్లు.. చీమ చిటుక్కుమంటే వాలిపోయే పోలీసులు.. 16 ఏండ్లు దాటితే తల్లిదండ్రులతో సంబంధం లేకుండా బతికే ఫ్రీడం. పెండ్లికి ముందే డేటింగ్ పేరిట చేసే సహజీవనం. అబ్బో ఒక్కటేమిటి అదో భూతల స్వర్గం మాదిరి అని జబ్బలు చరుచుకునే పాలకులు. మరి నేటి పరిస్థితి… 35 కోట్ల జనాభాను కంట్రోల్ చేయలేక, రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణించినవారిని పూడ్చిపెట్టలేని పరిస్థితి అమెరికాది. ఈ వ్యాధి ఇండియాలో వస్తే శవాల గుట్టలు చూస్తామని వాగిన నోర్లే ఇప్పుడు నోర్లు వెళ్లబెట్టి మనవైపు చూస్తున్నాయి.. ఇది మనకు తెలియని మన గొప్పతనం” అంటూ స్వాతి పేర్కొన్నారు.

మండిపడ్డ ఎన్నారైలు
స్వాతి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై అమెరికాలో ఉంటున్న ఎన్నారైలు.. ముఖ్యంగా అక్కడి తెలుగువాళ్లు మండిపడ్డారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్న ఎన్నారై శ్రవణ్.. స్వాతిపై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

For More News..

కరోనాతో అమెరికా ఆగమాగం

రూ. 300 కే పండ్లబుట్ట

క్యూలో ప్రాణాలు.. 15 గంటలైనా హాస్పిటల్‌‌ బయటే పేషెంట్లు

భారత్ లో 9వేలు దాటిన కేసులు