- మధ్యప్రదేశ్లో ఎక్స్కర్షన్ పోవచ్చు
- స్కూల్ స్టూడెంట్స్కు మాత్రమే
- విద్యుత్ ఆదా, ఇంధన పొదుపు అంశాలు
పద్మారావునగర్, వెలుగు : విద్యార్థులలో ఇంధన పొదుపు, సామర్థ్యంపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్లెవెల్స్కూల్స్పెయింటింగ్పోటీలు నిర్వహించనున్నట్టు ఎన్టీపీసీ ప్రకటించింది. గ్రూప్-ఎ లో 5, 6, 7 తరగతుల స్టూడెంట్స్, గ్రూప్- –బి లో 8, 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొనవచ్చు. స్కూల్, ఇంట్లో విద్యుత్ ఆదా అనే అంశంపైన లేకపోతే ఇంధన భద్రతకు ఇంధన పొదుపే కీలకం అనే అంశాలపై పెయింటింగ్స్వేయొచ్చు.
ప్రతి స్కూల్ఒక్కో గ్రూప్ నుంచి ది బెస్ట్అనుకున్న రెండు పెయింటింగ్స్, వివరాలతో అక్టోబర్ 27 లోగా పంపాలి. రాష్ట్ర స్థాయి పోటీలకు ఒక్కో గ్రూప్ నుంచి 50 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ పోటీలు నవంబర్ 18న సికింద్రాబాద్లోని కవాడిగూడ ఎన్టీపీసీ లిమిటెడ్ సదరన్ రీజియన్ ప్రధాన ఆఫీసులో ఉంటాయి. ఫస్ట్ప్రైజ్కింద రూ. 50 వేలు, సెకండ్ప్రైజ్కింద రూ. 30వేలు, థర్డ్ప్రైజ్కింద రూ. 20వేలు ఇస్తారు. అదనంగా ఒక్కో గ్రూప్లో 10 మందికి రూ.7,500 చొప్పున ప్రోత్సాహక బహుమతులు ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతి గ్రూప్ నుంచి టాప్-3లో నిలిచిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు.
నేషనల్స్డిసెంబర్ 11న నిర్వహిస్తారు. ప్రథమ విజేతకు రూ. లక్ష నగదుతో పాటు ల్యాప్టాప్, గోల్డ్ మెడల్, ద్వితీయ విజేతకు రూ. 50వేల నగదు, ల్యాప్టాప్, సిల్వర్ మెడల్,..తృతీయ విజేతకు రూ. 30వేల నగదు, ల్యాప్టాప్, బ్రాంజ్ మెడల్ ఇస్తారు. పది మందికి రూ.15వేల క్యాష్తో పాటు ట్యాబ్ అందిస్తారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో గెలిచిన వారు తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చేఏడాది జనవరిలో మధ్యప్రదేశ్లో ఉచిత విజ్ఞాన యాత్ర చేసే అవకాశాన్ని కల్పిస్తారు. వివరాలకు నోడల్ ఆఫీసర్ మదాసు లింగయ్య, సీనియర్ మేనేజర్, హెచ్ఆర్, ఎన్టీపీసీని [email protected] -మెయిల్ ద్వారా గాని, 7382294441, 7896717806 ఫోన్నంబర్లలో సంప్రదించొచ్చు.
