ప్రభుత్వానికి ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ రూ.3 వేల 248 కోట్ల డివిడెండ్‌‌‌‌‌‌‌‌

ప్రభుత్వానికి ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ రూ.3 వేల 248 కోట్ల డివిడెండ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను తుది డివిడెండ్‌‌‌‌‌‌‌‌గా రూ.3,248 కోట్లను మినిస్ట్రీ ఆఫ్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  చెల్లించింది. ఈ నెల 25న సీఎండీ గురదీప్ సింగ్, బోర్డు సభ్యులతో కలిసి కేంద్ర పవర్ శాఖ మంత్రి మనోహర్ లాల్‌‌‌‌‌‌‌‌కు డివిడెండ్ చెల్లింపు వివరాలను అందించారు. తాజాగా చెల్లించిన డివిడెండ్‌‌‌‌‌‌‌‌  నవంబర్ 2024లో చెల్లించిన రూ.2,424 కోట్ల తొలి ఇంటెరిమ్‌‌‌‌‌‌‌‌  డివిడెండ్‌‌‌‌కు, ఈ ఏడాది ఫిబ్రవరిలో చెల్లించిన రూ.2,424 కోట్ల రెండో ఇంటెరిమ్‌‌‌‌‌‌‌‌  డివిడెండ్‌‌‌‌‌‌‌‌కు  అదనం. 

ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి చెల్లించిన మొత్తం డివిడెండ్ రూ.8,096 కోట్లు.  అంటే ప్రతి రూ.10 ముఖ విలువ గల షేరుకు రూ.8.35 చెల్లించింది. గత  32 ఏళ్లుగా ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ  డివిడెండ్ చెల్లిస్తోంది. ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ గ్రూప్ ప్రస్తుతం 84 వేల మెగావాట్ల ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్డ్‌‌‌‌‌‌‌‌  విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థగా కొనసాగుతోంది.