దేవర నయా షెడ్యూల్ షురూ

దేవర నయా షెడ్యూల్ షురూ

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇటీవల గోవా షెడ్యూల్‌‌ను పూర్తి చేసిన టీమ్, దీపావళి సందర్భంగా బ్రేక్ తీసుకున్నారు. తాజాగా కొత్త షెడ్యూల్‌‌ను ప్రారంభించారు. మంగళవారం ఇందుకు సంబంధించిన అప్‌‌డేట్ ఇచ్చారు మేకర్స్. తమ హార్డ్ వర్కింగ్ టీమ్ మరో అద్భుతమైన షెడ్యూల్‌‌ కోసం తిరిగి సెట్స్‌‌లో జాయిన్ అయిందని చెప్పారు. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌‌‌‌తో పాటు ముఖ్య నటీనటులంతా ఇందులో పాల్గొంటున్నారు. రెండు వారాల పాటు జరిగే ఈ షెడ్యూల్‌‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఎన్టీఆర్‌‌‌‌కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌‌గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మొదటి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది.