
- ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్ల ఆహ్వానం
- మరింత మంది పర్యాటకులను ఆకట్టుకునేలా మరిన్ని హంగులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు:హైదరాబాద్‌ను విజిట్చేసే వారి లిస్టులో తప్పనిసరిగా ఉండే ప్లేస్ఎన్టీఆర్ గార్డెన్. నగరంలో నెక్లెస్రోడ్నిర్మించిన తర్వాత సందర్శకులను ఆకట్టుకునేలా ఆధునిక హంగులతో ఒక పార్క్ ఉండాలన్న లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం ఎన్టీఆర్గార్డెన్ఏర్పాటు చేసింది.1999లో ప్రారంభించిన ఈ పార్కు ప్రస్తుతం పాతబడిపోయింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మరింత మంది విజిటర్స్‌ను ఆకట్టుకునేలా మరిన్ని ఆకర్షణలను ఇందులో చేర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
అందులో భాగంగా హెచ్ఎండీఏ అధికారులు ఈ పార్క్‌ను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. ఆసక్తి గల సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. అవసరమైతే ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ పనులు చేపట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నెక్లెస్‌రోడ్‌కు సమీపంలోనే పీపుల్స్‌ప్లాజా, సెక్రటేరియట్‌కు ఎదురుగా లుంబినీ పార్క్ఉంది. ముందుగా ఎన్టీఆర్పార్కును ఆధునికీకరించాలని హెచ్ఎండీఏ ప్రతిపాదనలు పంపింది.
రోజుకు 20 వేలకు మించి సందర్శకులు
36 ఎకరాల్లోని ఎన్టీఆర్గార్డెన్ కు రోజుకు 20 నుంచి 25 వేల మంది సందర్శకులు వస్తుంటారు. పండుగలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య 30 వేలు దాటుతోంది. దీంతో సందర్శకులను మరింత ఆకట్టుకునేలా పార్క్ ను తీర్చిదిద్దాలని హెచ్ఎండీఏ డిసైడ్అయ్యింది. ఇప్పటికే ఎన్టీఆర్గార్డెన్లో పిల్లలు, పెద్దలను ఆకట్టుకునేందుకు జాయింట్ వీల్, మినీ ట్రెయిన్, వివిధ రకాల ఆటలకు సంబంధించిన పరికరాలు, ఆర్టిఫిషియల్ట్రీ, ట్రీ క్లైంబింగ్వంటి ఆకర్షణలు ఉన్నాయి. అలాగే ల్యాండ్స్కేప్గార్డెన్స్, రాక్‌గార్డెన్, వాటర్ఫౌంటెయిన్, రకరకాల పూల మొక్కల వనాలతో పాటు సందర్శకుల కోసం ఫుడ్‌కోర్టులు కూడా ఏర్పాటు చేశారు.
25 ఏండ్ల నుంచి ఇవి కొనసాగుతుండడంతో ఒకసారి వచ్చిన విజిటర్స్మళ్లీ రావడానికి ఆసక్తి చూపడం లేదు. మరికొన్ని ఆకర్షణలు జోడించాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ఇప్పటి జనరేషన్‌ను ఆకట్టుకునేలా కొత్త థీమ్‌తో కొత్త రకమైన ఆకర్షణలు ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. గార్డెన్ఆధునికీకరణకు అవసరమైన నిధులను హెచ్ఎండీఏ నుంచి వెచ్చించాలా? ప్రైవేట్భాగస్వామ్యం తీసుకోవాలా? అన్నవిషయంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. ముందుగా గార్డెన్ఆధునికీకరణకు ముందుకు వచ్చే సంస్థల నుంచి ప్రతిపాదనలు తీసుకున్న తర్వాత పనులు చేటట్టాలని కూడా భావిస్తున్నారు.