ఎన్టీఆర్.. నీల్ (NTRNeel) కాంబోపై ఇండియన్ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఎప్పటికప్పుడు మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో ఎన్టీఆర్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. మరోసారి ఈ మూవీ వాయిదా వేస్తూ, కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. వచ్చే ఏడాది 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా, ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గా (మే 20న) గ్లింప్స్ రిలీజ్ చేస్తామని తెలిపారు. రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్లో ఎన్టీఆర్ షాడో లుక్ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో ఎన్టీఆర్ షాడో లుక్ చూస్తే, ఇది కూడా KGF, సలార్ తరహాలో భారీ యాక్షన్ డ్రామా అవుతుందనే అంచనాలు మరింత పెరిగాయి. ఇక గ్లింప్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మీద మరింత క్రేజ్ పెరగడం ఖాయం.
HIS REIGN… HIS SOIL…
— Jr NTR (@tarak9999) April 21, 2026
JUNE 11, 2027… IT IS…. #NTRNeel pic.twitter.com/ln9Dq4BFZs
అయితే, ఇంతకుముందు ఈ సినిమా 2026 జూన్ 25కి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ప్రొడక్షన్ స్కేల్, ప్లానింగ్ కారణంగా రిలీజ్‌ను ఒక సంవత్సరం వాయిదా వేసినట్టు క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే తారక్ ఫ్యాన్స్ ఇంకేంతకాలం వెయిట్ చేయాలన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెలలు కాదు.. ఏకంగా ఏడాది పొడిగిస్తున్నారు.. అసలు కారణం ఏంటో చెప్పాలి అంటూ ట్వీట్స్ పెడుతున్నారు.
ఇకపోతే, ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుంది.
A Massacre by the dynamic duo delivers a notice for a havoc-filled experience 🔥
— Mythri Movie Makers (@MythriOfficial) April 29, 2025
𝟮𝟱 𝗝𝗨𝗡𝗘 𝟮𝟬𝟮𝟲.
You’ll hear the loudest chants! #NTRNeel 💥
A Special glimpse for the Man of Masses @tarak9999 ’s birthday.#PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm… pic.twitter.com/qAIgWa6mZM
సినిమా కథ విషయానికి వస్తే..!
ఇది1960ల కాలంలో జరిగిన కథగా రానుందని సమాచారం. గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతంలో మాదకద్రవ్యాల వ్యాపారాన్ని నియంత్రించిన చైనీస్ గ్యాంగ్‌స్టర్ జావో వీ జీవితం ఆధారంగా తెరకెక్కునున్నట్లు టాక్ ఉంది. ఇందులో ఎన్టీఆర్ ఒక మాఫియా డాన్ పాత్రలో నటించబోతున్నాడట. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సిగ్నేచర్ స్టైల్‌కు అనుగుణంగా, తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలతో కూడిన హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందని సమాచారం. మే 20న రానున్న గ్లింప్స్ తో క్లారిటీ వచ్చే అవకాశముంది.
The beast mode is about to ignite again 🔥#NTRNEEL next schedule begins soon.
— #NTRNeel (@NTRNeelFilm) November 6, 2025
Man of Masses @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm @TSeries pic.twitter.com/8KBZloMI7x

