
‘ఆర్ఆర్ఆర్’లో ‘నాటు నాటు’ అంటూ రామ్ చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ వేసిన స్టెప్పుల్ని ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్.. మరోవైపు తన నెక్స్ట్ మూవీ ఎప్పుడు స్టార్టవుతుందా అని ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే ఈ ప్యాన్ ఇండియా సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మించను న్నాయి. జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. చిరంజీవితో తీస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో.. ఇక ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెడు తున్నాడు కొరటాల. ప్రస్తుతం కొందరు రైటర్స్‌తో కలిసి స్క్రిప్ట్‌కు ఫైనల్ టచప్ ఇస్తున్నాడట. జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసినా ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ వల్ల ఎన్టీఆర్ జాయినవడం వీలుపడదు కాబట్టి ఇతర నటీనటులతో షూటింగ్ స్టార్ట్ చేయనున్నా రట. ఎలాగూ ఫిబ్రవరిలో ‘ఆచార్య’ రిలీజ్ కానుంది కనుక ప్రమోషన్స్ కోసం తారక్ మూవీకి కొరటాల బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చి నుంచి పూర్తి స్థాయిలో షూటింగ్ జరగబోతోంది. దసరాకి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు తెలు స్తోంది. హీరోయిన్‌గా ఆలియా భట్, కియారా అద్వానీ, పూజాహెగ్డేల పేర్లు వినిపిస్తున్నాయి.