సల్మాన్..ఎన్టీఆర్ మల్టీస్టారర్ ఫిక్స్..టైటిల్ ఏంటంటే?

సల్మాన్..ఎన్టీఆర్ మల్టీస్టారర్ ఫిక్స్..టైటిల్ ఏంటంటే?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman khan) నుండి వస్తున్న అవుట్ అండ్ అవుట్ స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ టైగర్3(Tiger 3). యశ్ రాజ్ ఫిలిమ్స్(Yash Raj Films) భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాను మనీష్ శర్మ(Maneesh Sharma) తెరకెక్కిస్తున్నారు. కత్రినా కైఫ్(Katrina kaif) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

లేటెస్ట్గా టైగర్ 3 మూవీలో తారక్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాలీవుడ్లో కథనాలు ఊపందుకున్నాయి. ఈ మూవీ క్లైమాక్స్‌లో ఎన్టీఆర్(NTR) కనిపించబోతున్నాడని సమాచారం. ఎన్టీఆర్ ఎంట్రీ కోసం మేకర్స్ భారీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. హాలీవుడ్‌లో మార్వెల్ సిరీస్‌కు ఎంత క్రేజ్ ఉందో..బాలీవుడ్‌లో YRF స్పై యూనివర్స్ ఫ్రాంచైజ్‌కు అంతే క్రేజ్ ఉంది. అయితే YRF స్పై యూనివర్స్ నుంచి వస్తున్న మూవీ వార్ 2. 

వార్ 2 లో హృతిక్ రోషన్‌తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ 2025 లో రిలీజ్ కానుంది. అయితే..వార్2 ద్వారా YRF స్పై యూనివర్స్‌లోకి అడుగుపెడుతున్న ఎన్టీఆర్.. ఆ సినిమా కంటే ముందుగానే రా ఏజెంట్‌గా పరిచయం కాబోతున్నారని లేటెస్ట్ అప్డేట్.

టైగర్ 3 క్లైమాక్స్లో ఎంట్రీ ఇచ్చే ఎన్టీఆర్ పాత్ర.. మళ్లీ వార్2 లో ఎంట్రీ ఇస్తుందన్న మాట. ఇదే విషయాన్నీ ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ విశ్వజిత్ పాటిల్ వెల్లడించారు. ఎక్స్‌క్లూజివ్ అంటూ సమాచారాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరి దీనిపై యశ్ రాజ్ ఫిలింస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read :- ఒకే ఏడాదిలో 6 పుర‌స్కారాలు

టైగర్3 లో సల్మాన్ ఖాన్ లుక్స్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. టీజర్ చూసిన ఆడియన్స్ మరీ ముఖ్యంగా సల్మాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ఇప్పటి వరకు ఉన్న ఇండియన రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేయడం ఖాయం అని కామెంట్స్ చేస్తన్నారు.