
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే జైలవకుశలో మూడు పాత్రల్లో కనిపించి అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సారి మూడు పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో కలిసి ‘RRR’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో తెలంగాణ గొండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్… మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్తొకటి సినీ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్ ఇందులో మూడు పాత్రల్లో కనపడనున్నారట. ఆ లుక్స్ ఎలా ఉంటాయనేది మాత్రం తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందేనంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 8న ‘RRR’ను విడుదల కానుంది.