ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో కొత్త షూటింగ్

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో కొత్త షూటింగ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి త్రివిక్రమ్ తో జతకడుతున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అరవింద సమేత తరువాత.. ఈ ఇద్దరు మరోసారి కలిసి పనిచేయబోతున్నారని తెలియగానే.. ఆ మూవీ డిటైల్స్ తెలుసుకోవడం కోసం సెర్చింగ్ కూడా స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. మరి ఈ కాంబోకి ఉన్న క్రేజ్ అలాంటిది.

అయితే.. ఈ కాంబో మరోసారి సెట్ ఐన మాట నిజమే కానీ.. అది సినిమా కోసం కాదు. ఒక కమర్షియల్ యాడ్ షూట్ కోసం. అవును.. ఎన్టీఆర్ చేయబోతున్న ఓ యాడ్ కి త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ యాడ్ షూట్ రేపటినుండి స్టార్ట్ కానుంది. ఇందుకోసం వేసిన ప్రత్యేకమైన సెట్ ఈ యాడ్ షూట్ జరగనుంది.

ఇక అసలు విషయం తెలుసుకున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఫ్యాన్స్ కొంత డిస్సపాయింట్ అవుతున్నారు. అంతేకాదు.. త్వరలోనే ఈ కంబోలో మూవీ సెట్ అయ్యి.. అరవింద సమేత లాంటి మరో బ్లాక్ బస్టర్ ని అందించాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ పాన ఇండియా మూవీ చేస్తున్నాడట. పాన్ ఇండియాలో లెవల్లో రానున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.