జనవరి 1 నుంచి నుమాయిష్.. మంత్రి శ్రీధర్ బాబు

జనవరి 1 నుంచి నుమాయిష్.. మంత్రి శ్రీధర్ బాబు

ప్రతి సంవత్సరం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ఈ సారి కూడా 83 వ ఆల్  ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఏర్పా్ట్లు చేశారు. జనవరి 1న నుమాయిష్ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది. ఈసారి ఎగ్జిబిషన్ టికెట్ ధర రూ. 40 గా నిర్ణయించారు నిర్వాహకులు. అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గాంచిన నుమాయిష్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి15 వరకు కొనసాగుతుంది. 

నుమాయిష్  ప్రెసిడెంట్ గా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ను నియమించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 8 దశాబ్దాలుగా  తెలంగాణలో జరుగుతు నుమాయిష్ కు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విజిటర్స్ వస్తారు. సేవా దృక్పథంతో సొసైటీ సభ్యులు పనిచేస్తున్నారు. ఎంతో మంది ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నారు. వారికి ప్రోత్సాహం సొసైటీ అందిస్తుంది. లక్షలాది మంది విజిటర్స్ వస్తుంటారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాటు చేస్తున్నారు నిర్వహికులు. 
 
అగ్ని ప్రమాదలు జరగకుండా నిర్వాహకులు చేపడుతున్నారు. వృద్ధులు నడవ లేని వానరికి ఎగ్జిబిషన్ లోపల ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనాలతో సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. ను మాయిష్ ను దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ పలు డిపోల నపుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. నాంపల్లి, గాంధీభవన్ మెట్రో ష్టేషన్లు ఎగ్జిబిషన్ మైదానానికి సమీపంగా ఉన్నాయి. మియాపూర్ - ఎల్బీనగర్, నాగోల్, - రాయదుర్గం మార్గాల్లో నడిచే మెట్రో రైళ్లను నుమాయిష్ ను దృష్టిలో ఉంచుకొని అర్థరాత్రి వరకు పొడిగించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా మెట్రో రైల్ కోసం స్పెషల్ టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశారు.