
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా కన్నప్ప చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన నుపుర్ సనన్ చివరకు హ్యాండ్ ఇచ్చింది. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా వెల్లడించాడు. కాల్షీట్లు సర్దుబాటు చేసుకోలేకపోవడం వల్ల నుపుర్ సనన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా వెల్లడించాడు. ఈ విషయాన్ని చెప్పడానికి తనకెంతో బాధగా ఉందన్నాడు. అంతేకాకుండా మరో హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించామని చెప్పుకొచ్చాడు. నుపుర్ చేస్తున్న ఇతర సినిమాలు మంచి సక్సెస్ కావాలంటూ అల్ ది బెస్ట్ చెప్పాడు. భవిష్యత్తులో తనతో కలిసి పనిచేయాలని అశిస్తున్నట్లుగా తెలిపాడు. సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి చూడండి అంటూ ట్వీట్ లో తెలిపాడు.
Sad to announce that lovely @NupurSanon had to step down from #Kannappa due to scheduling conflicts. We'll miss her, but the hunt for our new leading lady begins! Sending Nupur our best wishes on her other commitments. Hope to work with her in the near future
— Vishnu Manchu (@iVishnuManchu) September 20, 2023
Exciting times…
ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్రను ఆదర్శంగా తీసుకుని కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తు్న్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తు్ండగా, మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు. ఈ సినిమాలో ఎంతో కీలకమైన శివుడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారంటూ ప్రచారం నడుస్తోంది. అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్ మరియు తోట ప్రసాద్ ఈ మూవీకి స్టోరీ అందిస్తున్నారు. కాగా కృతిసనన్ సోదరిగా నుపుర్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నుపుర్ సనన్ ... తెలుగులో ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’లో యాక్ట్ చేస్తుంది.