
- ‘కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్’ ప్రతిపాదనలపై తీవ్ర అభ్యంతరం
- మొత్తం 4 అంశాలపై కొనసాగుతున్న భిన్నవాదనలు
హైదరాబాద్, వెలుగు: నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరసనలు కొనసాగుతుండగానే, గురువారం రాజ్యసభలో ఈ బిల్లు పాస్ అయింది. అయితే, ఈ బిల్లుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బిల్లులో ముఖ్యంగా నాలుగు అంశాలు వివాదాస్పదంగా మారాయి.
- బిల్లును ఎవరు వ్యతిరేకిస్తున్నారు? – జూనియర్‌డాక్టర్లు, డాక్టర్లు
- ఎవరు స్వాగతిస్తున్నారు? – నర్సులు, డెంటిస్టులు, ఆయుష్ డాక్టర్లు
- వివాదాస్పద అంశాలేమిటి? – కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్, ఫీజుల అంశం, ఎగ్జిట్ఎగ్జామ్, కమిషన్ లో డాక్టర్ల శాతం
- ఈ 4 ప్రతిపాదనల్లో ఏముంది?
కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ క్లాజ్
ఎన్‌ఎంసీ బిల్లులోని సెక్షన్ 32లో కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అనే క్లాజ్ ఉంది. మోడ్రన్ సైంటిఫిక్ మెడికల్ ప్రొఫెషన్‌తో ముడిపడి ఉన్న వ్యక్తులకు ‘కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్’గా ‘లిమిటెడ్ లైసెన్స్’ ఇవ్వొచ్చునని ఈ సెక్షన్‌లో ప్రతిపాదించారు. దీన్నే డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ పేరుతో స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ఫిజియో థెరపిస్టులు తదితరులకు మోడ్రన్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం ఇచ్చే చాన్స్ఉంది. బిల్లులోని సెక్షన్ 50, 51లో బ్రిడ్జ్ కోర్సు ప్రతిపాదనలున్నాయి. ఆయుష్ గ్రాడ్యుయేట్లకు, డెంటల్ డాక్టర్లకు స్వల్పకాలిక మోడ్రన్ మెడిసిన్ కోర్సు నిర్వహించి, మోడ్రన్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశమివ్వడం దీని ఉద్దేశం. వీళ్లకు మోడ్రన్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసేందుకు అవకాశమిస్తే, ప్రజారోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు చెబుతున్నారు. 70% ట్రీట్‌మెంట్ తామే చేస్తున్నామని, అలాంటప్పుడు ప్రైమరీ, ప్రివెంటివ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసేందుకు తమకు అవకాశం ఇస్తే తప్పేంటని నర్సులు ప్రశ్నిస్తున్నారు.
ఫీజుల నిర్ణయం
ప్రస్తుతం ప్రవేటు మెడికల్ కాలేజీల్లోని 85% సీట్ల ఫీజులను ప్రభుత్వాలే నియంత్రిస్తున్నాయి. 15% సీట్ల ఫీజులను కాలేజీలు నిర్ణయించుకుంటున్నాయి. ఎన్‌ఎంసీ బిల్లులో మాత్రం 50% సీట్ల ఫీజులనే ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. దీంతో కాలేజీలు తమ ఇష్టానికి ఫీజులు పెంచేసుకునే అవకాశముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వైద్య విద్య ఖర్చు పెరిగితే, వైద్యం ఖర్చులు పెరిగి దాని ఎఫెక్ట్ పేదలపై పడుతుందని చెబుతున్నారు.
ఎగ్జిట్ ఎగ్జామ్
ఫారిన్‌లో ఎంబీబీఎస్ చదివొస్తున్నొళ్లకు స్ర్కీనింగ్(ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్) టెస్ట్ పెడుతున్నారు. ఇది పాసైతేనే వైద్యునిగా గుర్తింపునిస్తున్నారు. ఇకపై దేశంలో చదివే విద్యార్థులకూ ఇలాంటి ఓ పరీక్ష పెట్టాలని బిల్లులో ప్రతిపాదించారు. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్(నెక్ట్స్)గా దీనికి పేరు పెట్టారు. ఫారిన్‌లో చదివినవాళ్లతోపాటు, దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహిస్తామని బిల్లులో పేర్కొన్నారు. అంటే, ఇది పాసైతేనే డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసేందుకు అర్హులవుతారు. దీన్ని వైద్య విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే, నీట్(పీజీ)కు బదులు నెక్ట్స్‌లో సాధించే ర్యాంకు ఆధారంగానే పీజీ సీట్ల భర్తీ చేపట్టనున్నారు. ప్రస్తుతం నీట్ మల్టిపుల్ చాయిస్ క్వశన్స్ బేస్డ్‌గా నిర్వహిస్తున్నారు. నెక్ట్స్ మాత్రం థియరీ ఎగ్జామ్. ఒకసారి ఎంబీబీఎస్ పాసై వెళ్లిపోయిన తర్వాత, మళ్లీ ఎంబీబీఎస్ సిలబస్ అంతా చదివి థియరీ ఎగ్జామ్ రాయడం తలకుమించిన భారమని డాక్టర్లు చెబుతున్నారు. థియరీ పేపర్ల కరెక్షన్, మార్కుల కేటాయింపులో అక్రమాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందనీ వాదిస్తున్నారు.
కమిషన్‌లో 80% నాన్ డాక్టర్స్
ప్రస్తుతం ఉన్న మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా గవర్నింగ్ బాడీలో 80% మంది డాక్టర్లు ఉంటే, 20% మంది నాన్ డాక్టర్స్ ఉంటారు. కానీ, మెడికల్ కమిషన్‌లో 80% స్థానాల్లో నాన్ డాక్టర్స్‌ను కూడా నియమించుకునే అవకాశమిచ్చారు. ఇంతకుముందు ప్రతి రాష్ర్టానికి ఎంసీఐలో ప్రాతినిథ్యం కల్పించేవారు. ఇకపై ర్యాండమ్‌గా ఒక్కో సంవత్సరం ఒక్కో రాష్ర్టానికి అవకాశం కల్పించేలా ప్రతిపాదనలున్నాయి. దీనివల్ల రాజకీయ జోక్యం పెరుగుతుందని, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల చేతుల్లోకి వైద్య విద్య వ్యవస్థ వెళ్తుందని డాక్టర్లు ఆరోపిస్తున్నారు.
సమస్య కొంతైనా తీరుతుంది
‘కమ్యునిటీ హెల్త్ ప్రొవైడర్స్’ ప్రతిపాదనలను స్వాగతిస్తున్నాం. దాంట్లో తప్పేం లేదు. డాక్టర్లు చెబుతున్నట్టు ప్రజారోగ్య వ్యవస్థ అసలే దెబ్బతినదు. ప్రస్తుతం డాక్టర్లు 30% చికిత్స చేస్తే, మిగిలిన 70% నర్సులే చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు నిరంతరం అందుబాటులో ఉండేది నర్సులే. గ్రామీణ ప్రాంతాలకు డాక్టర్లు వెళ్లకపోవడం వల్ల, నేటికి అక్కడి ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. నర్సులు, ఇతరులకు ప్రైమరీ కేర్ ట్రీట్‌మెంట్ చేసేందుకు అవకాశం ఇస్తే, ఈ సమస్య కొంతైనా తీరుతుంది.- ఎస్.సుజాత, గాంధీ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్
నష్టమే తప్ప లాభం లేదు
డాక్టర్లకు , వైద్య విద్యార్థులకు, ప్రజలకు నష్టం చేకూర్చేలా ఎన్ ఎంసీ బిల్లు ఉంది.మెడికల్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియాగవర్నింగ్ బాడీలో 80% డాక్టర్లు ఉంటే,ఎన్ఎంసీలో 20 శాతానికి కుదిం చారు.దీంతో మెడికల్ కమిషన్ రాజకీయశక్తులతో నిం డిపోయే ప్రమాదముంది.బిల్లు లోని సెక్షన్ 32 దొంగ డాక్టర్లకు మద్దతు ఇచ్చే దిగా ఉంది. ఎంబీబీఎస్‌కూడా చదవకుండానే వైద్యం చేసేందుకు అవకాశం ఇవ్వడం సరికా దు. బిల్లు తోనష్టమే తప్ప లాభం లేదు.- డాక్టర్ సంజీవ్ కుమార్, ఇండియన్ మెడికల్ అసోసి యేషన్ స్టేట్ సెక్రటరీ
‘ప్రైవేటు’ కుట్ర
ఎన్ ఎంసీ బిల్లు వెనుక ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాల కు ట్ర ఉంది. 50%సీట్ల ఫీజులను కా లేజీలకే కట్టబెట్టడం సరికా దు. ఎన్ ఎంసీలో రాష్ర్టాలకు ప్రాతినిథ్యం తగ్గించడం, రాష్ర్టాలహక్కు లను హరించడమే అవుతుంది.కేంద్రం బిల్లు లో సవరణలు చేయాలి.- డాక్టర్ పుట్ల శ్రీనివాస్ , డైరెక్టర్,మహబూబ్‌నగర్ మె డికల్ కాలేజ్ నెక్స్‌ట్ పై వివరణ ఇయ్యాలె
ఇంత మంది నిరసన తెలుపుతున్నా కేంద్రం స్పందించకపోవడం సరికా దు.నెక్ట్స్ ఎగ్జా మ్ విషయంలో వైద్యవిద్యార్థులంతా గందరగోళంలో ఉన్నారు.పీజీ ఎంట్రన్స్ కు, ఎగ్జిట్ ఎగ్జా మ్‌కు ముడిపెట్టడం సరికా దు. నెక్ట్స్ ఎలా నిర్వహిస్తారన్నదానిపై కేం ద్రం వివరణఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది.- డాక్టర్ విజయేందర్, తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసి యేషన్ చైర్మన్