Unstoppable show:పవన్ తో నర్సులపై బాలయ్య బ్యాడ్ కమెంట్..నర్సులు ఫైర్

Unstoppable show:పవన్ తో నర్సులపై  బాలయ్య బ్యాడ్ కమెంట్..నర్సులు ఫైర్

నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈ మధ్యనే దేవ బ్రాహ్మణులపై చేసిన కామెంట్లతో ఇరకాటంలో పడ్డ ఆయన తాజాగా నర్సులపై చేసిన కామెంట్లు మరోసారి రచ్చకు కారణమయ్యాయి. ఆహాలో ఇటీవల ప్రసారమైన అన్ స్టాపబుల్  షో ఎపిసోడ్ లో హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నర్సులు ఫైర్ అవుతున్నారు. ఆయన చేసిన కామెంట్లను తప్పుబడుతూ పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో నర్సులు నిరసన చేపట్టారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో సారీ చెబితే సరిపోదని, ఏ షోలో అయితే ఆ కామెంట్లు చేశారో అందులోనే క్షమాపణ చెప్పాలని అంటున్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజా సేవ చేస్తున్న నర్సులపై అలాంటి కామెంట్లు చేయడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న "అన్ స్టాపబుల్" సెలబ్రిటీ టాక్ షో కు ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చారు. ఆ ఎపిసోడ్ లో గతంలో తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి బాలయ్య ప్రస్తావించారు. ఇదే క్రమంలో "ఆ నర్సు దానమ్మ భలే అందంగా ఉందిలే" అంటూ కామెంట్లు చేశారు ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటంతో నర్సులు మండిపడుతున్నారు.