
హైదరాబాద్, వెలుగు: ఇచ్చంపల్లి నుంచే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి రివర్ లింకింగ్ ప్రాజెక్టు చేపట్టాలని నేషనల్‌వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) నిర్ణయించింది. నవంబర్3న హైదరాబాద్‌లో ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్ అధ్యక్షతన నిర్వహించే స్టాండింగ్ కమిటీ ఐదో సమావేశం, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రివర్లింకింగ్టాస్క్ఫోర్స్కమిటీ చైర్మన్వెదిరె శ్రీరామ్అధ్యక్షతన నిర్వహించే టాస్క్‌ఫోర్స్‌కమిటీ సమావేశంలో ఈ ప్రదిపాదనపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో మెమొరాండం ఆఫ్అండర్స్టాండింగ్(ఎంవోయూ) డ్రాఫ్ట్కాపీలను సభ్య రాష్ట్రాలకు అందజేయనున్నారు.
నాలుగో స్టాండింగ్కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి, అక్కడి నుంచి గోదావరి నీటిని తరలించాలని ప్రతిపాదించారు. చత్తీస్ గఢ్వినియోగించుకోకుండా మిగిలిన 151 టీఎంసీలను ఈ రివర్లింకింగ్ప్రాజెక్టులో భాగంగా తరలించనున్నారు. గతంలో 141 టీఎంసీలు మాత్రమే తరలిస్తామని ప్రతిపాదించగా, ఇప్పుడు ఇంకో పది టీఎంసీలు చేర్చారు.
అయితే తమ రాష్ట్రం వాటా నీటిని గోదావరి–కావేరి అనుసంధానానికి ఉపయోగించుకోవడాన్ని చత్తీస్గఢ్తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ రాష్ట్రం ఎంవోయూపై సంతాకం చేస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుట పడే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో చత్తీస్గఢ్రాష్ట్రాన్ని ఒప్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.