సంపన్నురాలైన సెల్ఫ్‌‌‌‌మేడ్ వుమెన్‌‌‌‌గా రికార్డ్‌‌‌‌

సంపన్నురాలైన సెల్ఫ్‌‌‌‌మేడ్ వుమెన్‌‌‌‌గా రికార్డ్‌‌‌‌
  • రూ. 48,100 కోట్లకు ఫల్గుణి నాయర్ సంపద
  • బంపర్‌‌‌‌‌‌‌‌ బోణి చేసిన నైకా షేర్లు 

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు: బ్యూటీ ప్రొడక్ట్‌‌‌‌లను అమ్మే స్టార్టప్ కంపెనీ  నైకా, కంపెనీ ఫౌండర్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. నైకా పేరెంట్ కంపెనీ ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ ఈ–కామర్స్ వెంచర్స్ షేర్లు బుధవారం మార్కెట్లు బంపర్ లిస్టింగ్ అయ్యాయి. దీంతో కంపెనీ ఫౌండర్ ఫల్గుణి నాయర్ సంపద అమాంతం పెరిగింది. బ్లూమ్‌‌‌‌బర్గ్‌‌‌‌ బిలియనీర్‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్ ప్రకారం, ఆమె సంపద 6.5 బిలియన్ డాలర్ల (రూ.48,100 కోట్ల) కు ఎగిసింది. దీంతో దేశంలో అత్యంత సంపన్నురాలైన సెల్ఫ్‌‌‌‌మేడ్ వుమెన్‌‌‌‌గా  ఫల్గుణి రికార్డ్ క్రియేట్ చేశారు.  లాభాలు తెచ్చుకున్న  మొదటి ఇంటర్నెట్ స్టార్టప్ కంపెనీగా నైకా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే మార్కెట్‌‌‌‌లో లిస్ట్‌‌‌‌ అయిన జొమాటో, కార్ట్‌‌‌‌ట్రేడ్ వంటి యూనికార్న్‌‌‌‌ కంపెనీలు ఇంకా నష్టాల్లోనే నడుస్తున్నాయి. నైకాలో 50 శాతానికి పైగా వాటా ఫల్గుణి చేతిలో ఉంది. మహిళా నాయకత్వంలోని యూనికార్న్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో లిస్ట్‌‌‌‌ అవ్వడం ఇదే మొదటి సారి.

ఫిజికల్ స్టోర్లను పెంచుతున్న నైకా.. 

2020–21 ఆర్థిక సంవత్సరంలో  నైకాకు రూ. 2,440 కోట్ల రెవెన్యూ వచ్చింది. కరోనా టైమ్‌‌‌‌లో సేల్స్ భారీగా పడిపోయినప్పటికీ, ప్రస్తుతం ఈ  సంక్షోభం నుంచి కంపెనీ రికవరీ అవుతోంది. ఇప్పటికే సేల్స్ కరోనా ముందు స్థాయిలకు చేరుకున్నాయని ప్రకటించింది. నైకాలో లైట్‌‌‌‌హౌస్‌‌‌‌ ఇండియా ఫండ్‌‌‌‌ 3, టీపీజీ గ్రోత్‌‌‌‌, స్టెడ్‌‌‌‌వ్యూ క్యాపిటల్‌‌‌‌, హీరో గ్రూప్‌‌‌‌కు చెందిన సునిల్ కాంత్‌‌‌‌ ముంజల్‌‌‌‌, ఫిడిలిటీ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ అండ్ రీసెర్చ్ పెద్ద కంపెనీలు ఇన్వెస్టర్లుగా ఉన్నాయి. డాట్ అండ్ కీ వెల్‌‌‌‌నెస్‌‌‌‌, పిపా.బెల్లా, 20డ్రెస్సెస్‌‌‌‌ వంటి ఫ్యాషన్ కంపెనీలను కొనుగోలు చేసిన కంపెనీ, ఫ్యాషన్ సెగ్మెంట్‌‌లో మరింత విస్తరించాలని ప్లాన్స్ వేసుకుంది. ప్రస్తుతం తమ యాక్టివ్ యూజర్లు సంఖ్య నెలకు 50 లక్షల మంది ఉన్నారని, మొత్తం 1.5 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారని కంపెనీ చెబుతోంది. నైకా ఫిజికల్ స్టోర్లను పెంచుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టింది.  ప్రస్తుతం కంపెనీకి దేశం మొత్తం మీద  80 కి పైగా స్టోర్లు ఉన్నాయి. ఈ స్టోర్ల సంఖ్యను 202 4 నాటికి 180 కి పెంచుకోవాలని చూస్తోంది. 500 పైగా బ్రాండ్లను అమ్ముతున్నామని కంపెనీ పేర్కొంది. వెబ్‌‌‌‌సైట్‌‌‌‌, యాప్‌‌‌‌, ఫిజికల్ స్టోర్ల ద్వారా 1.30 లక్షల  ప్రొడక్ట్‌‌‌‌లు సేల్‌‌కు రెడీగా ఉన్నాయని తెలిపింది. ఫ్యాషన్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో బిజినెస్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న అజియో, అమెజాన్‌‌‌‌‌‌‌‌, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌, మింత్రా వంటి ఈ–కామర్స్ కంపెనీలతో నైకాకు తీవ్ర పోటీ ఉంది. ఫ్యాషన్ సెగ్మెంట్‌‌లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో నైకాకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని ఎనలిస్టులు అంటున్నారు..

నైకా లిస్టింగ్ అదుర్స్‌‌‌‌‌‌‌‌..

నైకా షేర్లు మార్కెట్లో గ్రాండ్‌‌‌‌‌‌‌‌గా ఎంటర్ అయ్యాయి. ఐపీఓ ధర రూ. 1,125 కంటే 79.37 శాతం ప్రీమియంతో రూ. 2,018 వద్ద కంపెనీ షేర్లు ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈలో లిస్టింగ్ అయ్యాయి. ఇంట్రాడేలో రూ. 2,248 వరకు పెరిగి ఆల్‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌ హైని నమోదు చేశాయి. చివరికి రూ. 2,208 వద్ద క్లోజయ్యాయి. నైకా మార్కెట్ క్యాప్ రూ. లక్ష కోట్ల మార్క్‌‌ను క్రాస్ చేయడం విశేషం. కంపెనీ వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌ ఆకర్షణీయంగా ఉందని ఐపీఓకి ముందు ఎనలిస్టులు అంచనావేశారు. నైకా కంటే ముందు జొమాటో, కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రేడ్ యూనికార్న్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. నైకా ఐపీఓ ద్వారా రూ.5,350 కోట్లను సేకరించింది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ ఏకంగా 82 రెట్లు సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్ అయిన విషయం తెలిసిందే. ఆర్థికసంవత్సరం 2019–20 తో పోలిస్తే 2020–21 లో   కంపెనీ రెవెన్యూ 48 శాతం, ఇబిటా 181 శాతం ఎగిశాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.62 కోట్ల ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌ను కంపెనీ ప్రకటించగలిగింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 16 కోట్ల లాస్‌‌ను కంపెనీ ప్రకటించింది.  లిస్టింగ్ తర్వాత నైకా పేరెంట్ కంపెనీలో ప్రమోటర్ల వాటా 54.2 శాతం నుంచి 52.6 శాతానికి తగ్గింది. వివిధ ఫ్యామిలీ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌ల ద్వారా నైకా షేర్లు  ఫల్గుణి దగ్గర ఉన్నాయి  ఆమె కూతురు, కొడుకు నైకాలోని వివిధ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌లను చూసుకుంటున్నారు. ఐపీఓ ద్వారా సేకరించిన ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను  కొత్తగా రిటెయిల్ స్టోర్లను లేదా వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేయడానికి, అప్పులు తీర్చడానికి, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌కు వాడనున్నారు.